Reliance: ఇప్పటి వరకు అమెరికా సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం చూశాం. కానీ ఇప్పుడు భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో ఏకంగా రూ. 25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇంతకీ సంస్థ అంత పెద్ద ఎత్తున అమెరికాలో ఏం చేయనుందంటే.
అమెరికాలో దాదాపు 50 సంవత్సరాల తర్వాత కొత్త ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు భారత వ్యాపారవేత్త ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం విలువ సుమారు 300 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 25 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. అమెరికాలో కొత్త ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయడం దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ముఖ్యమైన పరిణామం. ఈ ప్రాజెక్ట్‌ను టెక్సస్ రాష్ట్రంలోని బ్రోన్స్‌విల్లే పోర్ట్ వద్ద నిర్మించనున్నారు. ఈ రిఫైనరీ నిర్మాణాన్ని అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ అనే సంస్థ చేపడుతోంది. అమెరికా దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు.
25
రిలయన్స్ భారీ పెట్టుబడి
భారతదేశానికి చెందిన అతిపెద్ద ప్రైవేట్ ఎనర్జీ కంపెనీలలో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ప్రాజెక్ట్‌లో కీలక పెట్టుబడి పెట్టనుంది. ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో చేసిన పోస్టులో ఈ ఒప్పందాన్ని “అమెరికా చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడి ఒప్పందం”గా పేర్కొన్నారు. రిలయన్స్ ఇప్పటికే జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తోంది. ఈ అనుభవంతో అమెరికాలో కూడా పెద్ద స్థాయిలో రిఫైనింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయనున్నారు.
35
షేల్ ఆయిల్ ప్రాసెసింగ్‌కు ప్రత్యేక రిఫైనరీ
ఈ కొత్త రిఫైనరీ అమెరికాలో ఉత్పత్తి అయ్యే 100% షేల్ ఆయిల్‌ను ప్రాసెస్ చేయగల సామర్థ్యంతో రూపొందించనున్నారు. మొత్తం 1.2 బిలియన్ బ్యారెల్స్ అమెరికన్ లైట్ షేల్ ఆయిల్‌ను ప్రాసెస్ చేసే ప్రణాళిక ఉంది. దీనివల్ల సుమారు 50 బిలియన్ గ్యాలన్ల రిఫైన్డ్ ఇంధన ఉత్పత్తులు తయారవుతాయి. ఈ ఉత్పత్తుల మొత్తం విలువ సుమారు 175 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ అమలుతో అమెరికాలో వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ తెలిపారు. దక్షిణ టెక్సాస్ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. అదేవిధంగా అమెరికా ఇంధన ఉత్పత్తి పెరగడం, దేశ భద్రత బలోపేతం కావడం, ప్రపంచ మార్కెట్లకు ఇంధన ఎగుమతులు పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ రిఫైనరీ ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన రిఫైనరీగా రూపొందుతుందని కూడా తెలిపారు.
55
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య కీలక ప్రాజెక్ట్
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన ఘర్షణల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లలో అస్థిరత పెరిగింది. హార్మోజ్ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం రవాణా జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో చమురు ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా దేశీయంగా ఇంధన ఉత్పత్తి పెంచేందుకు ఈ రిఫైనరీ ప్రాజెక్ట్ కీలకంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.