జోకర్ వేషంలో.. ‘సరదా’ కోసం కదులుతున్న ట్రైయిన్ లో 13మందిని విచక్షణారహితంగా కాల్చి చంపాడు..

Published : Aug 01, 2023, 11:28 AM IST

జపాన్ లో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి 13మందిని బలిగొన్నాడు. 

PREV
18
జోకర్ వేషంలో.. ‘సరదా’ కోసం కదులుతున్న ట్రైయిన్ లో 13మందిని విచక్షణారహితంగా కాల్చి చంపాడు..

జపాన్ : బీసీ కామిక్స్ లో డార్క్ క్యారెక్టర్ ‘జోకర్’... కరుడుగట్టిన విలన్ గా మారణకాండ కొనసాగిస్తుంటాడు. ఈ క్యారెక్టర్ గురించి తెలియని వారు ఉండరు. ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్తో అనేక సినిమాలు వచ్చాయి. జోకర్ ముసుగులో సీరియల్ హత్యలకు పాల్పడుతూ.. భయాందోళనలు కలిగిస్తుంది ఈ క్యారెక్టర్. తనకు జీవితంలో ఎదురైన అనేక పరాభవాల కారణంగా బీసీ కామిక్స్ లోఈ జోకర్ క్యారెక్టర్ విలన్ గా మారుతుంది.

28

అయితే ఓ వ్యక్తి నిజ జీవితంలో ఈ క్యారెక్టర్ నుంచి స్ఫూర్తి పొందాడు.  మారణకాండకు తెగించాడు. జోకర్ వేషం వేసుకొని.. తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 13 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఒక ట్రైన్ లో ప్రయాణించే సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు.

38

మారణకాండ సమయంలో జోకర్ ముసుగు వేసుకోవడంతో అతను ఎవరో.. ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని పట్టుకోవడం కోసం ముప్పుతిప్పలు పడ్డారు. కానీ, ఫలితం లేకపోయింది. కానీ నేరం చేసిన వాడు ఎప్పటికైనా పట్టుబడకుండా ఉండడు కదా.. చివరికి పోలీసులకు దొరికిపోయాడు.

48

ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..  2021హాలోవీన్ సమయంలో ఓ వ్యక్తి జోకర్ వేషంలో ట్రైన్ లోకి ఎక్కాడు. ఆ తర్వాత డిసి క్యారెక్టర్ జోకర్ తరహాలో పిచ్చిగంతులేశాడు. హాలోవిన్ కావడంతో దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. అంతలోనే ఒక 70 ఏళ్ల వృద్ధుడిపై కత్తితో దాడి చేశాడు.

58

ఆ తరువాత వెంటనే తనతో తెచ్చుకున్న గన్స్ బయటికి తీశాడు. చుట్టూ ఉన్న ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. 12 మంది ప్రయాణికులు ఈ కాల్పుల్లో నిర్దాక్షిణ్యంగా మృతి చెందారు. అతను చేస్తున్న ఈ మారణకాండను చూస్తున్న మిగతావారు తీవ్రంగా భయాందోళనలకు గురయ్యారు. 

68

ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. కాల్పులు జరిపిన తర్వాత అతను హఠాత్తుగా మాయమైపోయాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాయమయ్యాడో ఎవరూ గుర్తించలేకపోయారు. మారణకాండ గురించి తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు.ఈ మారణకాండ కు పాల్పడిన వ్యక్తి ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నించారు. సిసి ఫుటేజిని పరిశీలించారు. 

78

కానీ అందులో అతను జోకర్ వేషంలో ఉండడంతో.. ఆ ముసుగు వెనుక ఉన్నదెవరో తెలుసుకోలేకపోయారు. ఆ హంతకుడికి వ్యతిరేకంగా ఆధారాలు వెతకడం కోసం అనేక తిప్పలు పడ్డారు. ఎట్టకేలకు కాస్త ఆలస్యంగానైనా ఈ మారణకాండకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు, క్యోటా హటోరీ (26)అనే వ్యక్తే  ఆ జోకర్ వేషంలో ఉన్నది అని తేల్చారు.

88

వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆ తర్వాత ఎందుకు చంపావు అన్న ప్రశ్నకు అతడు చెప్పిన సమాధానం విని అందరూ షాక్ అయ్యారు.  ఆ 13 మందిని ‘సరదా’కోసం చంపానని చెప్పుకొచ్చాడు.ప్రజల్ని చంపడం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు.  దీంతో అవాక్కయిన న్యాయమూర్తి ఈ కేసులో హటోరీని దోషిగా తేల్చారు. 23 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 
 

click me!

Recommended Stories