నైజీరియా : ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కానిది చేసి గిన్నిస్ రికార్డులోకి ఎక్కుతుంటారు చాలామంది. అయితే కొంతమంది ఈ రికార్డు కోసం చేసే వెర్రిపనులు ఆశ్చర్యంగా ఉంటాయి. కొన్నిసార్లు మిస్ ఫైర్ అవుతుంటాయి.
29
అలాగే జరిగింది నైజీరియాలో. ఒక వ్యక్తి గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టాలనే ఆశతో ఏడు రోజుల పాటు బలవంతంగా ఏడ్చాడు.టెంబు ఎబెరే అనే వ్యక్తి న్నీరు కార్చే ప్రపంచ రికార్డు ప్రయత్నంలో వారం మొత్తం నాన్‌స్టాప్‌గా ఏడవడానికి ప్రయత్నించాడు.
39
దీంతో కంటిచుట్టూ ఉన్న వ్యవస్థ దెబ్బతిని అతను దృష్టిని కోల్పోయాడు. ఫలితంగా, అతను 45 నిమిషాల పాటు తాత్కాలిక అంధుడిగా మారాడు. దీనికి ముందు తలనొప్పి, ముఖం వాపు, ఉబ్బిన కళ్ళతో బాధపడ్డాడు.
49
"దీంతో నేను నా ఏడుపును తగ్గించుకోవలసి వచ్చింది" అని ఎబెరే అన్నాడు. కన్నీటి-ప్రయత్నాన్ని పూర్తి చేయాలని నిశ్చయించుకున్నాడు. దీనికోసం ఎబెరే అతను జీడబ్ల్యూఆర్ కి దరఖాస్తు చేయనప్పటికీ, అది లెక్కలోకి తీసుకోబడలేదు.
59
ఏది ఏమైనప్పటికీ, వెస్ట్ ఆఫ్రికన్ దేశంలో అతను మాత్రమే రికార్డ్-బ్రేకర్ కాదు, చాలా మంది నైజీరియన్లు ఇలాంటి క్రేజీ ఆలోచలనతో రికార్డులను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
69
ఇదిలా ఉండగా, మేలో హిల్డా బాసి అనే చెఫ్ "నైజీరియన్ వంటకాలకు పేరు తేవడానికి.." 100 గంటలపాటు నిరంతరం వంట చేసింది. ప్రముఖులు, దేశ ఉపాధ్యక్షులు కూడా ఆమెను ఉత్సాహపరిచారు, అధికారిక వెబ్‌సైట్ guinnessworldrecords.com ఆమె ప్రయత్నాన్ని గుర్తించింది.
79
26 ఏళ్ల ఆమె 93 గంటల 11 నిమిషాల పాటు వంట చేశారు. 2019లో భారతవ్యక్తి నెలకొల్పిన మునుపటి వంట మారథాన్ రికార్డును బద్దలు కొట్టగలిగారు.
89
మరో పాఠశాల ఉపాధ్యాయుడు, జాన్ ఒబోట్, సెప్టెంబరులో క్లాసిక్ సాహిత్యాన్ని 140 గంటల పాటు బిగ్గరగా చదవడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. ''నైజీరియాలో పఠన సంస్కృతిని ప్రోత్సహించడమే దీనికి ప్రేరణ'' అని పాఠశాల ఉపాధ్యాయుడు చెప్పాడు.
99
అతను 'అర్థవంతమైన రికార్డు'ని ప్రయత్నించాలనుకుంటున్నానన్నాడు. మరోవైపు వరల్డ్ గిన్నిస్ రికార్డ్ మాత్రంవెర్రి ప్రయత్నాలతో జాగ్రత్తగా ఉండాలని నైజీరియన్లను కోరింది.