పాకిస్తాన్‌లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడానికి ముఖ్యంగా ఐదు కారణాలు ఉన్నాయి..
1. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ షాక్: గల్ఫ్ ప్రాంతంలో, మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు, షిప్పింగ్ మార్గాల్లో అంతరాయాల వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. పాకిస్తాన్ తన అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతుంది కాబట్టి, గ్లోబల్ మార్కెట్ ప్రభావం వెంటనే అక్కడ పడింది.
2. డాలర్ల కొరత: పాకిస్తాన్ ముడిచమురును అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ డాలర్లలో కొంటుంది. కానీ లోకల్ ప్రజల నుండి రూపాయల్లో వసూలు చేస్తుంది. ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ఎక్కువ డాలర్లు అవసరమవుతాయి. ఇది పాకిస్తాన్ ఫారెక్స్ రిజర్వులపై విపరీతమైన ఒత్తిడి తెచ్చింది.
3. పన్నులు, లెవీలు: ఇంటర్నేషనల్ ధర మాత్రమే కాకుండా, పాకిస్తాన్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై దాదాపు రూ. 114 దాకా పన్నులు, పెట్రోలియం డెవలప్‌మెంట్ లెవీ రూపంలో వసూలు చేస్తోంది.
4. భారీ అప్పుల భారం: పాకిస్తాన్ జూన్ 2025 నాటికి రూ. 80.52 ట్రిలియన్ల పబ్లిక్ అప్పుల్లో కూరుకుపోయింది. ఇది వారి జిడిపిలో 70.7 శాతానికి సమానం.
5. బహిరంగ నిధులపై ఆధారపడటం: పాకిస్తాన్ ప్రస్తుతం $7 బిలియన్ల ఐఎంఎఫ్ (IMF) ప్రోగ్రామ్ కింద నడుస్తోంది. ఐఎంఎఫ్ షరతుల ప్రకారం సబ్సిడీలను ఎత్తివేయాల్సి రావడంతో ధరలు మరింత పెరిగాయి.