South Africa
1. దక్షిణాఫ్రికా:
లింగ వివక్షత, మహిళలపై హింస విపరీతంగా పెరిగిపోతున్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా దీన్ని పేర్కొంటున్నారు. మహిళల భద్రత విషయంలో దేశం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. కొన్ని సంస్థల నివేదిక ప్రకారం కేవలం 25% మంది మహిళలు మాత్రమే ఒంటరిగా బయట నడవడం సురక్షితంగా భావిస్తున్నారట. ఇకడ మహిళలపై లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా ముప్పులు అధికంగా ఉంది.
India
2. భారతదేశం:
గొప్ప సాంస్కృతిక వారసత్వం, విభిన్న భౌగోళిక పరిస్థితులు కలిగిన భారతదేశంలో కూడా మహిళల భద్రత పెద్ద సవాలుగా మారింది. మహిళలపై లైంగిక వేధింపులు ఇక్కడ అత్యధికంగా జరుగుతున్నాయి. అలాగే మానవ అక్రమ రవాణా, బలవంతపు శ్రమ, ఇతర రకాల దోపిడీలను భారతీయ మహిళలు ఎదుర్కొంటున్నారు. మహిళల రక్షణకు సంబంధించి కఠిన చట్టాలు లేకపోవడమే ఇందుకు కారణమనే భావన వుంది. తగిన రక్షణ లేకపోవడంతో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే మహిళలే కాదు గృహిణులు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది.
Afghanistan
3. ఆఫ్ఘనిస్తాన్:
తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల పరిస్థితి దారుణంగా మారిపోయింది. స్వేచ్ఛ, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక అవకాశాలపై తీవ్రమైన ఆంక్షలను మహిళలు ఎదుర్కొంటున్నారు. గృహ హింస, ఇతర రకాల లైంగిక వేధింపులకు గురవుతున్నారు. దేశంలోని ఉద్రిక్త పరిస్థితులు, రాజకీయ అస్థిరత మహిళల పరిస్థితిని రోజురోజుకు దుర్భరంగా మారుస్తున్నాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటిగా నిలిచింది.
Somalia
4. సోమాలియా:
నిరంతరం ఉద్రిక్త పరిస్థితులు, హానికరమైన సాంస్కృతిక పద్ధతుల కారణంగా సోమాలియా మహిళలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరుల లభ్యత తీవ్రంగా పరిమితం చేయబడింది. ఇక్కడి ఆటవిక ఆచారాల కారణంగా మహిళలు శారీరక హింసకు గురవుతున్నారు. చట్టపరమైన రక్షణ లేకపోవడం, లింగ వివక్షత, హింస విపరీతంగా ఉండటం వల్ల సోమాలియా మహిళలకు చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా మారింది.
Congo
5. కాంగో :
కాంగో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా పేర్కొనబడుతోంది. మహిళలపై అత్యాచారాలు, వివక్ష ఈ దేశంలో చాలా ఎక్కువ. ఈ దేశ మహిళల దుర్భర పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు.
Yemen
6. యెమెన్:
ఏళ్లుగా అంతర్యుద్ధం కారణంగా యెమెన్ లో మహిళల పరిస్థితి దారుణంగా మారింది. ఇక్కడ మహిళలకు ఆరోగ్య పరంగానే సామాజిక భద్రత కూడా కరువయ్యింది. ఇలాంటి దేశంలో మహిళల ఆర్థిక స్వేచ్చ గురించి చెప్పుకోవడం అనవసరం. ఇక్కడి ఆచార సాంప్రదాయాలు కూడా మహిళలపై వివక్షకు కారణం.