ఈ సింగాబాద్ రైల్వే స్టేషన్ చాలా చిన్నది.. పురాతనమైనది కూడా.. బ్రిటీష్ కాలంలో దీన్ని నిర్మించారు. ఎంత చిన్నదైనా.. చాలా ప్రాచీనమైనది కావడంతో.. ఈ రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య గత సంబంధాలలో ఇది కీలక పాత్ర పోషించింది. స్వాతంత్య్రానికి ముందు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి వ్యక్తులు ఢాకా వెళ్ళడానికి ఈ స్టేషన్ గుండా వెళ్ళేవారు.