అసలేం జరిగింది :
మన పొరుగుదేశం చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ పరిధిలోని క్విజో ప్రాంతంలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గతనెల (జూలై) 30న ఎనిమిదేళ్ల మనవరాలిని తాత డ్యాన్స్ క్లాస్ నుండి తీసుకుని వెళుతున్నాడు. అయితే మార్గమధ్యలో ఈ తాత మనవరాలు విడిపోయారు... దీంతో ఆ చిన్నారి రోడ్డుపై ఒంటరిగా మిగిలిపోయి దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కుంది.
ఇంటికి వెళ్లే దారి తెలియదు..? తాతది కాదు కుటుంబసభ్యుల్లో ఎవ్వరి ఫోన్ నెంబర్ ఆమెకు తెలియదు..? సాయం చేయడానికి ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేరు. ఇలాంటి పరిస్థితిలో ఆ చిన్నారి ఏమాత్రం ఆందోళన చెందలేదు... తన మెదడుకు పనిచెప్పింది. చుట్టుపక్కల ప్రాంతాన్ని నిశితంగా గమనించి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంది. ఆమె తెలివిగా ఆలోచించి సురక్షితంగా ఇంటికి చేరుకుంది.