ప్రపంచంలోని కొన్ని దేశాలు ప్రాస్టిట్యూషన్ వర్క్‌ను నియంత్రిత పద్ధతిలో అనుమతిస్తున్నాయి.
* నెదర్లాండ్స్‌లో ప్రాస్టిట్యూషన్ చట్టబద్ధం. అక్కడ లైసెన్స్ పొందిన ప్రాస్టిట్యూషన్ గృహాలు నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది. ప్రాస్టిట్యూషన్ వర్కర్లు పన్నులు చెల్లిస్తూ కొన్ని కార్మిక హక్కులను కూడా పొందగలరు.
* జర్మనీలో కూడా ప్రాస్టిట్యూషన్ ను చట్టబద్ధమైన వృత్తిగా గుర్తించారు. అక్కడ ఉద్యోగ ఒప్పందాలు చేసుకునే అవకాశం, ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
* స్విట్జర్లాండ్‌లో ప్రాస్టిట్యూషన్ వర్క్ చట్టబద్ధమే. అక్కడ పనిచేసే వారు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కార్మిక హక్కులు కూడా వారికి లభిస్తాయి.
* బెల్జియం ఇటీవల ప్రాస్టిట్యూషన్ వర్కర్ల హక్కులను బలోపేతం చేసే చర్యలు చేపట్టింది. ఉద్యోగ భద్రత, భీమా, సామాజిక రక్షణ వంటి అంశాల్లో వారికి మద్ధతు ఇస్తోంది.