అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ... రేసులో వున్న కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ గురించి ఆసక్తికర విశేషాాలు

First Published Nov 5, 2024, 10:41 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 చివరి దశకు చేరుకున్నారు. అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో నూతన అధ్యక్షుడు ఎవరనేది తేలనుంది. 

US election 2024

US election 2024 : యావత్ ప్రపంచానికే పెద్దన్న అమెరికాను వచ్చే నాలుగేళ్ళు పాలించేదెవరు? అమెరికన్లు ఎవరికి పట్టం కడతారు? వారి తీర్పు ఎలా వుంటుంది?... ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రతిఒక్కరి మనసులో మెదులుతూ వుంటాయి.   అతి త్వరలోనే ఈ ఉత్కంఠకు తెర పడనుంది. చాలా రోజులుగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అమెరికన్లు తమ తీర్పును వెలువరించే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది... అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం వరకు పోలింగ్ కొనసాగుతుంది. 
 

US election 2024

అధ్యక్ష రేసులో వున్నది ఎవరెవరు? 

అమెరికాలో ప్రధాన రాజకీయ పార్టీలు రెండు మాత్రమే. ఒకటి రిపబ్లిక్ అయితే మరోటీ డెమొక్రటిక్. ఈ రెండు పార్టీల్లో ఓ పార్టీ అధికారంలో వుంటే మరోపార్టి ప్రతిపక్షం. ఇలా ఈసారి కూడా రెండు పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ప్రస్తుతం అధికారంలో వున్న డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న కమలా హ్యారిస్ ను బరిలోకి దింపింది. ఆమె భారత సంతతికి చెందిన అమెరికన్ ... దీంతో ఆమె విజయం సాధించాలని భారతీయులు కోరుకుంటున్నారు. 

ఇక రిపబ్లిక్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగారు. గత అధ్యక్ష ఎన్నికల్లో కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన ఆయన జో బైడెన్ చేతిలో ఓటమి చవిచూసారు. దీంతో ఎలాగైనా రెండోసారి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా పనిచేయాలన్న పట్టుదలతో వున్న ఆయన మళ్లీ పోటీలో నిలిచారు. అయితే ఈసారి ఆయన ప్రత్యర్థి బైడెన్ కాదు కమలా హ్యారిస్. 

Latest Videos


US election 2024

ఎవరీ కమలా హారిస్ : 

అమెరికాలో స్థిరపడిన భారత మహిళ శ్యామలా గోపాలన్, ఆఫ్రో జమైనన్ డొనాల్డ్ జె హ్యారిస్ దంపతుల కూతురే కమలా హారిస్.  వేరువేరు దేశాలకు చెందిన శ్యామల, డొనాల్డ్ లను అమెరికా ఏకం చేసింది... ఇప్పుడు వీరి కూతురు అమెరికా రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుంది.

 కాలిపోర్నియాలోని  ఓక్లాండ్ లో అక్టోబర్ 20, 1964 లో కమలా హారిస్ జన్మించారు. 1966లో శ్యామల, డొనాల్డ్ దంపతులకు రెండో సంతానంగా మాయ జన్మించింది. అయితే వివిధ కారణాలతో శ్యామల, డొనాల్డ్ దంపతులు వేరుకాగా ఇద్దరు పిల్లలను తల్లివద్దే పెరిగారు.   

కమలా హారిస్ 1981లొ మాంట్రియల్ లోని వెస్ట్ మాంట్ హైస్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసారు. ఆ తర్వాత 1981-81 లో వానియర్ కాలేజీలో చేరారు. వాషింగ్టన్ లోని హోవార్డ్ యూనివర్సిటీ నుండి 1986లో పొలిటికల్ సైన్స్ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత శాన్ ప్రాన్సిస్కో లోని హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ ది లా లో చేరారు... అక్కడే ఆమె రాజకీయాలకు బీజం పడింది. ఆమె బ్లాక్ లా స్టూడెంట్స్ అసోసియేషన్ లో చేరి అధ్యక్షురాలిగా పనిచేసారు. 
 

US election 2024

కమలా హారిస్ రాజకీయ జీవితం :  

లా కాలేజీలో స్టూడెంట్ యూనియన్ లీడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమలా హారిస్ రాజకీయాలనే కెరీర్ గా ఎంచుకున్నారు. 1990 లో కాలిఫోర్నియాలోని అల్మెడ కౌంటీ డిప్యూటీ  డిస్ట్రిక్ అటార్నీగా నియమితులయ్యారు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన ఆమె 2002లో శాన్ ప్రాన్సిస్కో డిస్ట్రిక్ అటార్నీగా నియమితులయ్యారు. ఇక అప్పటినుండి హారిస్ వెనుదిరిగి చూడలేదు... 2011 వరకు అదే పదవిలో కొనసాగారు. 

2011లో కాలిపోర్నియా అటార్నీ జనరల్ గా హారిస్ ఎన్నికయ్యారు. కాలిపోర్నియా చరిత్రలో  మొదటి మహిళా అటార్నీ జనరల్ కమలనే. 2017 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2017 లొ కాలిఫోర్నియా నుండి యూఎస్ సెనెటర్ గా ఎన్నికయ్యారు. 2021 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఇక 2021లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ అధ్యక్షుడిగా, కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 

అయితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో మొదట మళ్ళీ జో బైడెన్ బరిలో దిగేందుకు సిద్దమయ్యారు. కానీ వివిధ కారణాలతో ఆయన వెనక్కి తగ్గగా కమలా హారిస్ అనూహ్యంగా అధ్యక్ష రేసులో నిలిచారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తే అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా చరిత్రలో నిలిచిపోతారు. 

US election 2024

డొనాల్డ్ ట్రంప్ : 

ఇప్పటికే ఓసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన ఇప్పుడు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. మరి అమెరికన్ ఓటర్ల తీర్పు ఎలా వుంటుందో చూడాలి. 

ట్రంప్ వ్యక్తిగత జీవితం : 

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జూన్ 14, 1946 లో మేరీ అన్నే మాక్లియోడ్ - ఫ్రెడ్ ట్రంప్ దంపతులకు నాలుగో సంతానంగా డొనాల్డ్ ట్రంప్ జన్మించారు. క్యూ ఫారెస్ట్, న్యూయార్క్ మిలిటరీ అకాడమీ, ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసాడు. 1964 లో ఫోర్ధమ్ విశ్వవిద్యాలయంలో రెండేళ్లు, ఆ తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదివాడు. ఇలా 1968 బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో పట్టభద్రుడయ్యారు. 

1977లొ ట్రంప్ చెక్ మోడల్ ఇవానా జెల్నికోవాను వివాహమాడారు.  ముగ్గురు పిల్లలు పుట్టాక ట్రంప్ మరో మహిళతో సహజీవనం ప్రారంభించాడు. ఇలా 1993 లో మాపుల్స్ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇక 2005 లో స్లొవేనియన్ మోడల్ మెలానియాను మూడో వివాహం చేసుకున్నాడు. ఇలా ముగ్గురు భార్యల ద్వారా ఐదుగురు పిల్లలు సంతానాన్ని పొందాడు ట్రంప్. మొదటి భార్య ద్వారా డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్... రెండో భార్య ద్వారా టిఫనీ... మూడో భార్య ద్వారా బారన్ ను సంతానంగా పొందాడు. 

ట్రంప్ రాజకీయ జీవితం :

వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు సాధించిన తర్వాత ట్రంప్ రాజకీయాల వైపు మళ్లాడు. 1987 లో రిపబ్లికన్ పార్టీలో చేరాడు. అయితే సాధారణంగా మంచి మాటకారి అయిన ట్రంప్ రాజకీయాల్లో చేరాక సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచేవారు... ఇలా రిపబ్లికన్ పార్టీలో అతడి స్థాయి పెరిగింది. ఇలా 2015 లో ఏకంగా అమెరికా అధ్యక్ష రేసులో నిలిచారు. 2016 నవంబర్ 8న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరి క్లింటన్ ను ఓడించి అమెరికా పాలనా పగ్గాలు అందుకున్నాడు. 2017 లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 2021 వరకు కొనసాగారు. 

అయితే రెండోసారి అంటే 2021 లో మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన ట్రంప్ ఓడిపోయారు. కానీ ఈ నాలుగేళ్లు ప్రతిపక్షంలో వుండి బైడెన్ ప్రభుత్వంతో పోరాడిన ట్రంప్ మళ్లీ అధ్యక్ష బరిలో నిలిచారు. ఈసారి ఎలాగైనా గెలిచి మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో వున్నారు ట్రంప్. 

click me!