Iran: కోటి రూపాయ‌ల నోట్ విడుద‌ల చేసిన ఇరాన్‌..ఈ క‌రెన్సీ ఇండియాకు తెస్తే దాని విలువెంతో తెలుసా?

Published : Mar 24, 2026, 05:21 PM IST

Iran: ఇరాన్‌లో ఇటీవల ఒక వార్త ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లు, అమెరికా–ఇజ్రాయెల్‌తో ఉన్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ ప్రభుత్వం 10 మిలియన్ రియాల్ (ఒక కోటి రియాల్) విలువ గల కొత్త నోటును విడుదల చేసింది. 

PREV
15
ఇరాన్‌లో ఒక కోటి రియాల్ నోటు విడుదల

ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా 10 మిలియన్ రియాల్ నోటును విడుదల చేసింది. సంఖ్య పరంగా చూస్తే ఇది చాలా పెద్ద మొత్తంలా అనిపిస్తుంది. కానీ అక్కడి కరెన్సీ విలువ గత కొన్ని సంవత్సరాల్లో చాలా వేగంగా పడిపోవడంతో ఈ నోటు అవసరం ఏర్పడింది. ఇరాన్ రియాల్ విలువ తగ్గిపోవడం వల్ల చిన్న నోట్లతో పెద్ద మొత్తాలను చెల్లించడం కష్టమవుతోంది. అందుకే పెద్ద విలువ గల నోట్లను ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

25
ఈ నోటు ఎందుకు అవసరమైంది?

ఇరాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగింది. వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో చిన్న నోట్లతో లావాదేవీలు చేయడం చాలా కష్టంగా మారింది. ఉదాహరణకు రోజువారీ అవసరమైన వస్తువులు కొనాలంటే కూడా ప్రజలు పెద్ద పెద్ద నోట్ల కట్టలు తీసుకుని తిరగాల్సి వస్తోంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం పెద్ద విలువ గల నోట్లను విడుదల చేయాలని నిర్ణయించింది.

35
భారత కరెన్సీలో ఈ నోటు విలువ ఎంత?

10 మిలియన్ రియాల్ అంటే ఒక కోటి రియాల్ అని వినగానే చాలా పెద్ద మొత్తంలా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి దీని విలువ అంత ఎక్కువ కాదు. ప్రస్తుతం అంచనా ప్రకారం 10 మిలియన్ రియాల్ విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 650 నుంచి రూ. 725 వరకు మాత్రమే ఉంటుంది. అంటే సంఖ్య పెద్దగా ఉన్నా కొనుగోలు శక్తి మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇది ఇరాన్ కరెన్సీ ఎంత బలహీనపడిందో స్పష్టంగా చూపిస్తుంది.

45
పెరుగుతున్న ధరలతో

ఇరాన్‌లో రోజువారీ అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఉదాహరణకు కిలో గోధుమ పిండి సుమారు 5,20,000 రియాల్, బియ్యం – సుమారు 2,00,000 రియాల్ వరకు ఉంది. అలాగే లీట‌ర్ పాలు సుమారు 6,00,000 రియాల్ గా ఉంది. ఈ ధరలు సాధారణ ప్రజలపై భారీ ఆర్థిక భారం పెడుతున్నాయి. కుటుంబ ఖర్చులను నిర్వహించడం రోజురోజుకీ కష్టంగా మారుతోంది.

55
పెద్ద నోట్లు సమస్యకు పూర్తి పరిష్కారం కావు

పెద్ద విలువ గల నోట్లు విడుదల చేయడం వల్ల లావాదేవీలు కొంత సులభం అవుతాయి. కానీ ఇది అసలు సమస్య అయిన ద్రవ్యోల్బణాన్ని తగ్గించదు. ధరలు పెరుగుతూనే ఉంటే ప్రజల ఆదాయం తగ్గినట్టే అవుతుంది. అలాగే వారి పొదుపుల విలువ కూడా తగ్గిపోతుంది. అందుకే ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇరాన్‌లో అసలు అవసరం ఆర్థిక స్థిరత్వం, ద్రవ్యోల్బణ నియంత్రించ‌డమే.

Read more Photos on
click me!

Recommended Stories