వైరస్ నుంచి మమ్మల్ని కాపాడండి... నగ్నంగా డాక్టర్ల నిరసన

First Published Apr 29, 2020, 12:38 PM IST

రాజకీయాలను పక్కనబెట్టి ముందు మాకు రక్షణాత్మక దుస్తులు, పరికరాలను సరఫరా చేయండని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా రెండున్నర లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
undefined
ఈ మరణాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కాగా.. వైరస్ సోకిన వారి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో వైద్యులు సైతం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
undefined
ఈ నేపథ్యంలో.. మా ప్రాణాలు కూడా కాస్త కాపాడండి అంటూ వైద్యులు వేడుకుంటున్నారు. ఈ మేరకు తమకు రక్షణాత్మక పరికరాలు (పీపీఈ) కిట్లు ఇవ్వాలంటూ వైద్యులు కోరుతున్నారు. అయినా.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో.. జర్మీనీలో వైద్యులు అరనగ్న ప్రదర్శన చేపట్టారు.
undefined
రాజకీయాలను పక్కనబెట్టి ముందు మాకు రక్షణాత్మక దుస్తులు, పరికరాలను సరఫరా చేయండని వారు డిమాండ్‌ చేస్తున్నారు.
undefined
కరోనా వైరస్‌ తీవ్ర స్థాయలో ప్రపంచవ్యాప్తంగా విజృంభించడంతో రక్షణాత్మక పరికరాలు, దుస్తులైన గ్లవ్స్‌, మాస్క్స్‌, వెంటిలేటర్లకు భారీగా డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో సరఫరా సరిపోవడం లేదు.
undefined
అందువల్లే అందరికీ అందించలేకపోతున్నామని జర్మనీ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి ఒకరు అంగీకరించారు. ఇప్పటికే 133 మిలియన్‌ మాస్క్‌లను దేశవ్యాప్తంగా పంపిణీ చేసినట్టు తెలిపారు.
undefined
చైనా నుంచి 10 మిలియన్‌ మాస్క్‌లను తాజాగా దిగుమతి చేసుకున్నామని, మొత్తం సైన్యానికి మరో 15 మిలియన్‌ మాస్క్‌లను అతి త్వరలోనే అందిస్తామని కూడా వివరించారు.
undefined
జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం తాజా గణాంకాల ప్రకారం జర్మనీలో ఇప్పటికే ఒక లక్షా 59 వేల మందికి కరోనా వైరస్‌ సోకింది. అందులో ఆరు వేల మందికి పైగా చనిపోయారు.
undefined
జర్మనీ ఇంకా కరోనా వైరస్‌ తీవ్రత నుంచి బయటపడలేదని, ఇంకా చాలా కాలం పట్టవచ్చునని చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ స్పష్టం చేశారు.
undefined
ఇది వినడానికి క‌ష్టంగా ఉన్న‌ప్ప‌టికీ కరోనాతో మనం కొంతకాలం కలిసి జీవించాల్సిందేనని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, జర్మనీలో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా కొన్ని సంస్థలు, దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
undefined
click me!