పురుషుల వీర్యంపై కరోనా ఎఫెక్ట్.. భయంతో ఏం చేస్తున్నారంటే..

First Published | Apr 16, 2020, 9:29 AM IST
కరోనా సోకితే వీర్యోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందేమోననే భయంతో అమెరికాలో కొందరు పురుషులు స్పెర్మ్‌బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. తమ వీర్యాన్ని భద్రపర్చుకునేందుకు వాటి ముందు క్యూ కడుతున్నారు. 
 
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 20లక్షల మందికి పైగా.. వైరస్ సోకి బాధపడుతున్నారు.
ఇప్పటికే ఈ వైరస్ బారిన పడుకుండా ఎలా ఉండాలా అని చాలా మంది ప్రజలు భయపడిపోతున్నారు. అయితే.. తాజాగా పెళ్లి కాని అబ్బాయిలకు ఈ వైరస్ కారణంగా కొత్త భయం పట్టుకుంది.

కరోనా ఎఫెక్ట్.. పురుషుల సంతానోత్పత్తిపై పడుతుందనే భయం మొదలైంది. ఈ వైరస్ కారణంగా తమకు భవిష్యత్తులో పిల్లలు పుట్టరేమో అనే కంగారు వారిలో మొదలైంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయాల కోసం పరుగులు పెడుతున్నారు.
కరోనా సోకితే వీర్యోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందేమోననే భయంతో అమెరికాలో కొందరు పురుషులు స్పెర్మ్‌బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. తమ వీర్యాన్ని భద్రపర్చుకునేందుకు వాటి ముందు క్యూ కడుతున్నారు.
ఈ పరిణామంతో గత కొన్ని వారాల వ్యవధిలోనే అమెరికాలో స్పెర్మ్‌ సేకరణ కిట్ల అమ్మకాలు 20 శాతం పెరిగాయి. ఈ కిట్ల ద్వారా ఇంట్లో వీర్యం సేకరించి, దాన్ని భద్రపర్చుకునేందుకు స్పెర్మ్‌ బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు.
లైంగిక సంపర్కంతో కరోనా వ్యాపించదని ఇటీవల చైనాలో నిర్వహించిన అధ్యయనంలో తేలగా, వీర్యకణాల ఉత్పత్తిపై దాని ప్రభావం ఎంతమేర ఉంటుందనేది తెలుసుకోలేకపోయారు.
ఫ్రాన్స్‌లో జరిగిన మరో అధ్యయనంలో జ్వరంతో వీర్యం ఉత్పత్తి క్షీణించవచ్చని, వీర్యకణాల చలనం కొంత తగ్గే అవకాశం ఉందని గుర్తించారు. జ్వరం వస్తే వీర్యకణ ఉత్పత్తి తగ్గడం సాధారణమేనని స్పష్టంచేశారు.
వైరల్‌ వ్యాధులతో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గదని న్యూయార్క్‌ వర్సిటీకి చెందిన ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ ప్రొఫెసర్‌ జేమ్స్‌ గ్రిఫో తెలిపారు.

Latest Videos

click me!