Fake Doctors in Pakistan : మన దాయాది దేశం పాకిస్థాన్ లో MBBS చదివిన డాక్టర్ల కంటే అడ్డదారిలో డాక్టర్లుగా మారిన శంకర్ దాదా ఎంబిబిఎస్ లే ఎక్కువగా ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధికారులే వెల్లడిస్తున్నారు.
Fake Doctors : 'యదా రాజ తదా ప్రజ'... అంటే పాలించేవారు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారని పెద్దతు చెబుతుంటారు. మన పక్కదేశం పాకిస్థాన్ లో సేమ్ ఇలాంటి పరిస్థితే నెలకొంది.. అసమర్ధ పాలన కారణంగా ఫేక్ డాక్టర్లు విచ్చలవిడిగా పుట్టుకువస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ చివరకు దేశ ఆరోగ్య వ్యవస్థనే సంక్షోభంలోకి నెట్టారు ఈ నకిలీ డాక్టర్లు. చెతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు పాక్ పాలకులు నష్టనివారణ చర్యలు చేపట్టారు.
25
పాకిస్థాన్ కు నకిలీ డాక్టర్ల బెడద
పాకిస్థాన్ మెడికల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ గఫూర్ షోరో ప్రకారం... వందలు వేలలో కాదు ఏకంగా లక్షల్లో నకిలీ డాక్టర్లు ఉన్నారట. పాకిస్థాన్ వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మందికి పైగా ఫేక్ డాక్టర్లు ప్రజలకు తెలిసీతెలియని వైద్యం అందిస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. సింద్ హెల్త్ కేర్ కమీషన్ (SHCC), పాకిస్థాన్ మెడికల్ ఆండ్ డెంటల్ కౌన్సిల్ కూడా నకిలీ డాక్టర్ల వ్యవహారాన్ని ధృవీకరిస్తున్నాయి.
35
పాకిస్థాన్ లో సెల్ఫ్ మేడ్ డాక్టర్లు
''కొన్నిరోజులు హాస్పిటల్స్, మరికొన్నిరోజులు మెడికల్స్ లో పనిచేసి బేసిక్ ట్రీట్మెంట్, మెడిసిన్స్ గురించి తెలుసుకుంటున్నారు. తర్వాత ఎలాంటి మెడికల్ డిగ్రీ లేకపోయినా సొంతంగా క్లినిక్స్ ఓపెన్ చేసి సొంతగా వైద్యం చేయడం ప్రారంభిస్తున్నారు. ట్రీట్మెంట్, ఇచ్చే మందులవల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ గురించి వారికి ఏమాత్రం తెలియదు. వైద్యపరికరాలను శుభ్రం చేయకుండా వాడటమే కాదు ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరంజీలనే మరొకరికి వాడుతున్నారు. దీనివల్ల హెపటైటిస్ తో పాటు AIDS వ్యాప్తి చెందుతోంది'' అని అబ్దుల్ గఫూర్ ఆందోళన వ్యక్తం చేశారు.
నకిలీ డాక్టర్ల వ్యవహారాన్ని పాక్ పాలకులు సీరియస్ గా తీసుకోవడంలేదు. అందుకే అక్రమ ఆసుపత్రులను మూసివేసిన మరుసటి రోజే కొత్తవి తెరుస్తున్నారు. బలహీనమైన చట్టాల వల్ల నిందితులు సులభంగా బెయిల్‌పై బయటకు వస్తున్నారు. తనిఖీ బృందాలకు బెదిరింపులు కూడా వస్తున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు ప్రధాన నగరాల్లో కూడా నకిలీ డాక్టర్లు, కనీస సౌకర్యాలు లేని క్లినిక్ లు కనిపిస్తాయట.
55
పాకిస్థాన్ లో పెరిగిన ఎయిడ్స్ కేసులు
పాకిస్థాన్ లో ప్రస్తుతం HIV, AIDS కేసులు భారీగా పెరిగాయి.. ఇందుకు నకిలీ డాక్టర్లే కారణంగా తెలుస్తోంది. సరిగ్గా శుభ్రంచేయని వైద్యపరికరాలు, శానిటైజ్ చేయని ఇంజెక్షన్స్. సరైన వైద్యపద్దతులు పాటించకపోవడం వల్లే ఎయిడ్స్ కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా అంతర్జాతీయ బృందాలు దర్యాప్తులో తేలింది. కాసులకోసం కక్కుర్తితో వైద్యులుగా మారిన కేటుగాళ్లు వళ్ల అభంశుభం తెలియని చిన్నారులు కూడా ఎయిడ్స్ బారిన పడుతున్నారట. కాబట్టి పాకిస్థాన్ ప్రభుత్వం వెంటనే వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది.