Bharat Mart: 27 లక్షల చదరపు అడుగుల్లో భారత్‌ మార్ట్‌.. మన దేశంలో కాదు, ఎక్కడంటే.

Published : Apr 15, 2025, 03:30 PM IST

యూఏఈలో భారత్ మార్ట్ పేరుతో పెద్ద మాల్ ఓపెన్ కానుంది. ఇది 2026లో మొదలవుతుంది. జెబెల్ అలీ ఫ్రీ జోన్‌లో ఉన్న భారత్ మార్ట్ 27 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో ఉంటది. ఇక్కడ దుకాణాలు, షోరూమ్‌లు, గిడ్డంగిలు ఉంటాయి. దీనివల్ల భారతదేశంలో తయారైన వస్తువులను ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, యూరేషియాకు చేరవేయడానికి సహాయపడుతుంది.  

PREV
12
Bharat Mart: 27 లక్షల చదరపు అడుగుల్లో భారత్‌ మార్ట్‌.. మన దేశంలో కాదు, ఎక్కడంటే.
Bharat Mart

దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఇటీవల భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత మాల్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పారు. భారత్ మార్ట్‌ను తరచుగా చైనీస్ డ్రాగన్ మార్ట్‌తో పోలుస్తారు. భారత్ మార్ట్ దుబాయ్‌లో బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-కన్స్యూమర్ (B2C) మార్కెట్‌గా ఉంటుంది. ఈ మార్ట్‌ను భారతీయ వ్యాపారానికి, ప్రపంచ మార్కెట్‌కు మధ్య వ్యాపారం చేయడానికి వీలుగా రూపొందించారు. 

డీపీ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్, సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయమ్ మాట్లాడుతూ.. భారత్ మార్ట్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. "భారత్ మార్ట్ ప్రపంచ వినియోగదారులకు, ముఖ్యంగా మధ్యప్రాచ్యం, ఆఫ్రికా కొనుగోలుదారుల కోసం భారతీయ ఉత్పత్తులను చేరవేస్తుంది. ఈ దేశాల ప్రజలు ఇక్కడ నుంచి భారతీయ వస్తువులను తీసుకెళ్లి వారి దేశంలో విక్రయించుకోవచ్చు" అని అన్నారు.
 

22
Representative image

27 లక్షల చదరపు అడుగుల్లో భారత్ మార్ట్:

భారత్ మార్ట్ 27 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. మొదటి దశ 13 లక్షల చదరపు అడుగుల్లో ఉంటుంది. ఇది భారతదేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) ప్రధాన వ్యాపార కేంద్రంగా పనిచేస్తుంది. భారత్ మార్ట్‌లో 1500 షోరూమ్‌లు ఉంటాయి. ఇక్కడ 7 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో అత్యాధునిక గిడ్డంగిలు, చిన్న పరిశ్రమ యూనిట్లు, ఆఫీసులు, మీటింగ్ రూములు ఉంటాయి. మహిళలు నడిపే వ్యాపారాలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించారు.

భారత్ మార్ట్ జెబెల్ అలీ పోర్టు నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో, అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి ఇతిహాద్ రైలుకు కూడా సులువుగా వెళ్లొచ్చు. భారత్ మార్ట్‌లో భారతీయ వ్యాపారాలకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories