ముంచుకొస్తున్న డెల్టా వేరియంట్.. జాగ్రత్త పడకపోతే వినాశనమే.. : డబ్ల్యూహెచ్‌ఓ

First Published Jul 13, 2021, 10:27 AM IST

"డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వేగంతో దూసుకుపోతోంది, కేసులు, మరణాలలో కొత్త స్పైక్‌ను పెంచుతుంది." అని అది తెలిపింది. 

జెనీవా : కోవిడ్ 19 డెల్టా వేరియంట్ తో రాబోయే "వినాశకరమైన వ్యాప్తి" గురించి డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ టెడ్రెస్ హెచ్చరించారు. ఈ కొత్త వేరియంట్ తీవ్రమైన వేగంతో వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సోమవారం హెచ్చరించారు.
undefined
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు గత నాలుగు వారాలుగా పెరుగుతున్నాయని.. అన్నారు. ఇది ‘నాలుగోవారంగా గత వారం గుర్తించబడింది" అని జెనెవాలో ఏర్పాటు చేసిన వర్చువల్ విలేకరుల సమావేశంలో టెడ్రోస్ అన్నారు, "పది వారాల క్షీణత తరువాత, మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి" అని ఆందోళన వ్యక్తం చేశారు.
undefined
2020 అక్టోబర్‌లో భారత్ లో కోవిడ్ 19 వైరస్ మొదటి సారిగా గుర్తించారు. అప్పటినుంచి వైరస్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పుడు 104 దేశాలలో ఈ వైరస్ ఉందని జిన్హువా నివేదించింది."డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వేగంతో దూసుకుపోతోంది, కేసులు, మరణాలలో కొత్త స్పైక్‌ను పెంచుతుంది." అని అది తెలిపింది.
undefined
దీని నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల నాయకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫ్రాన్స్ వంటి దేశాలు కొత్త ఆంక్షలను అవలంబిస్తుండగా, ఇతరులు వాటిని సడలించారు. యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె), జూలై 19 న అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని భావిస్తోంది.
undefined
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కోవిడ్ నిబంధనల్లో సడలింపునిస్తున్నాయని దీనివల్ల కొత్త వేరియంట్ విజృంభించే అవకారం ఉందని సోమవారం విలేకరుల సమావేశంలో, డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ హెచ్చరించారు. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికీ జనాభా మొత్తానికి వ్యాక్సిన్ల ప్రక్రియ పూర్తి చేయలేదు.
undefined
ప్రస్తుతం సమూహాలుగా చేరకుండా నిరోధించడం అనే స్ట్రాటజీ తనకు అగ్నిమాపక సిబ్బంది అవలంభించే వ్యూహం గుర్తొస్తుందని అన్నారు. అడవి అంటుకున్నప్పుడు మంటలు ఎక్కువగా ఉన్న దగ్గర పని చేస్తాం. మంటలు ఆరిపోయి పొగ రాగానే.. అయిపోయిదనుకుంటాం. కానీ ఆ పొగ మాటున నక్కి ఉన్న అగ్ని రేణువు మళ్లీ అడవిని నాశం చేస్తుంది... అంటూ చెప్పుకొచ్చారు.
undefined
మహమ్మారి మీద ప్రపంచమంత కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని.. అన్ని దేశాల ప్రభుత్వాలు వ్యాక్సిన్లను పంచుకోవాలని.. పిలుపునిచ్చారు.
undefined
click me!