ఖైదీలతో మహిళా అధికారిణి రాసలీలలు: చివరికి అదే జైలులో ఖైదీగా.,..

First Published Jul 4, 2021, 5:01 PM IST

ఖైదీలను సంస్కరించాల్సిన అధికారిణి వారిని తమ అవసరాలను తీర్చుకొనేందుకు ఉపయోగించుకొంది. తన కామవాంఛను తీర్చుకొనేందుకు ఆమె ఖైదీలను ఉపయోగించుకొంది.

జైలులోని ఖైదీలను సంస్కరించాల్సిన విధుల్లో ఓ మహిళా అధికారిణి వారిని లైంగిక వేధింపులకు పాల్పడింది. ఈ వేధింపులు భరించలేక కొందరు ఖైదీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయమై విచారణ జరిపించి నిందితురాలిపై చర్యలు తీసుకొన్నారు.
undefined
కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైల్‌లో మగ ఖైదీల పర్యవేక్షణ, సవరణల అధికారిణిగా టీనా గోన్‌జలెబ్ పనిచేసేది. జైలులో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను తనతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాలని కోరేది.
undefined
ఫోన్ లో తనతో శృంగార సంభాషణలు చేయాలని కోరేది. ఖైదీలతో తన కామ వాంఛలనుతీర్చుకొనేది.ఈ వేధింపులు భరించలేక ఆమెపై కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై ఆమెను ఈ ఏడాది మే లో అరెస్ట్ చేశారు.
undefined
పోలీసుల విచారణలో టీనా వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. విడుదలైన ఖైదీల నుంచి, అధికారుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి జడ్జి ముందు ఉంచారు
undefined
ఒకరితో శృంగారంలో పాల్గొంటున్న సమయంలో మిగతావాళ్లను కన్నార్పకుండా చూడాలని కండిషన్‌ పెట్టేది. ఇక వాళ్లకు పోర్న్‌ వీడియోలు చూపించి అందులో మాదిరి పాల్గొనాలని ఒత్తిడి చేసేది. అంతేకాదు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా తన యూనిఫామ్‌కు ఆమె రంధ్రాలు చేసుకునేదని నివేదిక ఇచ్చారు అధికారులు. ఆ అకృత్యాల రిపోర్ట్‌ను చూసి జడ్జి సైతం బిత్తరపోయాడు.
undefined
గోన్‌జలెజ్‌ మీద వృత్తిపరమైన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఖైదీలకు రేజర్లు, సెల్‌ఫోన్లతో పాటు మద్యం, డ్రగ్స్‌ సప్లై చేసేదని సెక్స్‌ రిటర్న్‌ గిఫ్ట్ లుగా వాటికి పేరు పెట్టిందని ఓ మాజీ ఖైదీ జడ్జి ముందు వాపోయాడు. ఇక ఆమెపై నమోదైన ఆరోపణలన్నీ నిజమేనని జైలు మాజీ అధికారి ఈ నివేదికను రూపొందించిన స్టీవ్‌ మెక్‌కోమాస్‌ కోర్టుకు వెల్లడించాడు.
undefined
నిందితురాలి తరపున కౌన్సెలర్‌ మాట్లాడుతూ ఆ టైంలో గోన్‌జలెస్‌ వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆ బాధలోనే ఆమె అలా ప్రవర్తించిందని తెలిపాడు. ఆమె మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని క్షమించాలని కోర్టును వేడుకున్నాడు.
undefined
అయితే ఇంతటి దారుణాలకు పాల్పడ్డ ఆమెను జడ్జి ఒక కామ పిశాచిగా పేర్కొన్నాడు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావ్‌. మూర్ఖంగా వ్యవహరించావు. మిగతా జీవితం అయినా మంచిగా బతుకు అని తీర్పు వెలువరించే ముందు జడ్జి వ్యాఖ్యానించాడు.
undefined
కాగా, ఆమెకు నేర చరిత్ర లేకపోవడంతో మూడేళ్ల ఎనిమిది నెలలు శిక్షతో సరిపెట్టాడు జడ్జి. ఇప్పటికే జైలులో గడిపినందున.. ఆ శిక్షను మైనస్‌ చేసి మరో రెండేళ్లు సాధారణ జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి వెల్లడించాడు. ఏ జైల్లో అయితే అధికారిణిగా అకృత్యాలకు పాల్పడిందో అదే జైలుకి ఇప్పుడామె ఖైదీగా వెళ్లింది.
undefined
click me!