బాయ్ ఫ్రెండ్ తో ట్రిప్ కు వెళ్లిన మహిళ అదృశ్యం.. అడవిలో విగతజీవిగా.. మిస్టరీ ఏంటంటే...

First Published Sep 20, 2021, 11:24 AM IST

సెప్టెంబర్ 11 తరువాత ఆమె కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. 22 యేళ్ల పెటిటో తన బాయ్‌ఫ్రెండ్‌తో రోడ్ ట్రిప్ కి వెళ్లింది. ఆ తరువాత ఆమె గురించిన సమాచారం లేదు. దీంతో ఆమె అదృశ్యం మిస్టరీగా మారింది. తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు వెతకడం ప్రారంభించారు.

Gabrielle Petito

వాషింగ్టన్ : వ్యోమింగ్‌లోని యుఎస్ నేషనల్ ఫారెస్ట్ లో  ఆదివారం ఒక మృతదేహం లభ్యమైందని తెలిపింది. కనిపించకుండా పోయిన గాబ్రియెల్ "గబ్బి" పెటిటో కోసం అన్వేషణలో భాగంగా అడవిలో వెతకగా మృతదేహం కనిపించిందని వారు తెలిపారు. ఈ మృతదేహం ఆనవాళ్లు కనిపించకుండా పోయిన మహిళతో సరిపోలుతున్నాయని వారు తెలిపారు. 

సెప్టెంబర్ 11 తరువాత ఆమె కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. 22 యేళ్ల పెటిటో తన బాయ్‌ఫ్రెండ్‌తో రోడ్ ట్రిప్ కి వెళ్లింది. ఆ తరువాత ఆమె గురించిన సమాచారం లేదు. దీంతో ఆమె అదృశ్యం మిస్టరీగా మారింది. తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు వెతకడం ప్రారంభించారు.

Gabrielle Petito

ఆదివారం వ్యోమింగ్‌లోని ముఖ్యమైన సెర్చ్ ఏరియాలో ఒక మృతదేహం లభించిందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. అంతేకాదు ఈ మృతదేహం ఆనవాళ్లు పెటిటో వర్ణనతో సరిపోలుతున్నాయని ఎఫ్ బిఐ ఏజెంట్ చార్లెస్ జోన్స్ విలేకరుల సమావేశంలో చెప్పారు.

"మేము గబ్బీని కనిపెట్టాం. ఆ మృతదేహం ఆమెదే... అయితే 100 శాతం ధృవీకరించడానికి ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది అన్నారు. ఈ విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలిపాం" అని ఆయన చెప్పారు. అయితే చనిపోవడానికి కారణాలు ఇంకా గుర్తించలేదని కూడా తెలిపారు. 

ఈ విషాదానికి గబ్బి కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తున్నానని కూడా జోన్స్ అన్నారు. వారు కుమార్తెను కోల్పోయి తీవ్ర దు:ఖంలో ఉన్నారు. వారిని ఇంకా బాధించకుండా, గోప్యతను పాటించాలని విలేకరులకు జోన్స్ సూచించారు. 

Gabrielle Petito

పెటిటో తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, జూలైలో తన ప్రియుడు బ్రియాన్ లాండ్రీ (23) తో కలిసి క్రాస్ కంట్రీ అడ్వెంచర్ కోసం క్యాంపర్ వ్యాన్‌లో బయలుదేరింది.  కాగా రెండు వారాల క్రితం లాండ్రీ ఫ్లోరిడాలోని నార్త్ పోర్టులోని తన ఇంటికి ఒంటరిగా పెటిటో వ్యాన్‌లో తిరిగి వచ్చాడు. ఆ తరువాత పది రోజులకు, ఆమె కుటుంబం పెటిటో కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. 

కాగా,ఈ కేసులో లాండ్రీని "పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్" గా పోలీసులు ప్రకటించారు. అయితే లాండ్రీ పోలీసులకు సహకరించడానికి నిరాకరించారు. ఆ తరువాత లండ్రీ కూడా కనిపించకుండా పోవడంతో కేసులో మిస్టరీ పెరిగిపోయింది. 

శుక్రవారం నాడు లాండ్రీ తల్లిదండ్రులు తమ కొడుకును చాలా రోజులుగా చూడలేదని పేర్కొంటూ నార్త్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిమీద పోలీసులు మాట్లాడుతూ.. లాండ్రీ "పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్" మాత్రమే.. అయితే అతనే నేరానికి పాల్పడ్డాడని అనుకోవడం లేదు... అన్నారు. 

Gabrielle Petito

ఆదివారం ఎఫ్‌బిఐ ప్రకటన నేపథ్యంలో, నార్త్ పోర్ట్ పోలీసులు ఈ మేరకు ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ వార్త "అత్యంత విచారకరం,  హృదయ విదారకం" అని పేర్కొన్నారు. 

మేము ఈ జంటను ఇంటికి తీసుకురావాలన్న దిశగానే ఎఫ్ బిఐతో కలిసి ముందుకు సాగాం. ఈ విషాద ఘటనలో నిజానిజాలు వెలికి తీయడానికి FBI తో కలిసి పనిచేయడం కొనసాగిస్తాం అని నార్త్ పోర్ట్ పోలీసులు తెలిపారు. 

అదృశ్యమైన ఈ జంట ఈస్ట్ కోస్ట్‌లోని న్యూయార్క్ నుండి అమెరికా అంతటా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రయాణంలో భాగంగా అమెరికన్ వెస్ట్ లోని అద్భుతమైన దృశ్యాలను ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ ఫొటోల్లో వారిద్దరూ తమ చిన్న తెల్లటి వ్యాన్ పక్కన సంతోషంగా నవ్వుతున్నారు.

ఈ క్రమంలో యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఒక వీడియోలో, పెటిటో,  లాండ్రీ సున్నితంగా ముద్దు పెట్టుకోవడం, సూర్యాస్తమయాన్ని ఆనందించడం, బీచ్‌లో షికార్లు చేయడం కనిపించింది.

Gabrielle Petito

అయితే, ఆగస్టులో.. పెటాటో, లాండ్రీల మీద గృహ హింస కేసు నమోదయ్యిందని ఉటాలోని పోలీసులు చెప్పుకొచ్చారు. యుఎస్ మీడియా ప్రసారం చేసిన బాడీ క్యామ్ ఫుటేజ్ లో పెటాటో లాండ్రీతో గొడవపడి,  కలవరపడడం కనిపిస్తుంది.

దీనిమీద ఒక పోలీసు ఆఫీసర్‌తో మాట్లాడుతూ, పెటిటోను గట్టిగా నెట్టబడిందని, గట్టిగట్టిగా ఏడ్చిందని.. ఆమె మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తెలిపిందని అన్నారు. పెటిటో లాండ్రీతో వాగ్వాదం తరువాత అతన్ని చెంపదెబ్బ కొట్టింది. అయితే అతన్ని గాయపరచాలని కాదని కూడా తెలిపింది. మేము ఈ మార్నింగ్ కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా గొడవపడ్డాం.. అని తెలిపిందన్నారు. 

‘అంతేకాదు లాండ్రీ నన్ను వ్యాన్ లోకి ఎక్కనివ్వలేదు, నేను స్థిమితపడాలని సూచించాడు’ అని ఆమె తెలిపిందన్నారు. ఇంకా ఈ గొడవ గురించి పోలీసులు చెబుతూ.. పెటిటో వ్యాన్ తాళాలు గుంజుకోవడానికి ప్రయత్నించింది. తను పడనివ్వకపోడంతో  ఫోన్ తో కొట్టింది. దీంతో తాను ఆమెను నెట్టేశానని..’లాండ్రీ చెప్పాడన్నారు. 

Gabrielle Petito

అయితే ఈ జంట మీద ఎలాంటి ఛార్జీలు వేయకూడదనుకున్న పోలీసులు గొడవ సద్దు మణగాలంటే ఇద్దరూ వేర్వేరుగా గడపాలని సూచించారు. ఇంతలో 
పెటిటో అదృశ్యం వార్త సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యింది. వెంటనే ఆమెను కనిపెట్టాలంటూ ఫోన్ల వరద మొదలయ్యిందని తెలిపారు. 

ఆమె తండ్రి జో పెటిటో, ఆమె గురించి సమాచారం తెలిస్తే వెంటనే అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు, దీనికోసం అనానిమస్ టిప్ లైన్ ఏర్పాటు చేయబడిందని చెప్పారు. జోన్స్ ఆదివారం టిప్ లైన్ కోసం చేసిన అభ్యర్థనకు ప్రజలనుంచి మంచి ప్రతిస్పందన వచ్చింది. 

click me!