Baba Vanga : 2026లో ప్రపంచ యుద్ధం తప్పదని బాబా వంగా అప్పుడే చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమె చేసిన గ్రేట్ వార్ భవిష్యవాణి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచం ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన భౌగోళిక రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో, దశాబ్దాల క్రితమే మరణించిన బల్గేరియాకు చెందిన అంధ ప్రవక్త బాబా వంగా చేసిన భవిష్యవాణి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె 2026 సంవత్సరానికి సంబంధించి చేసిన హెచ్చరికలు అక్షరాలా నిజమవుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
25
2026: గ్రేట్ వార్ ప్రారంభం
బాబా వంగా తన అంచనాలలో 2026వ సంవత్సరాన్ని అత్యంత ప్రమాదకరమైన ఏడుగా పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావం ఉంటుందని ఆమె అప్పట్లోనే చెప్పారు. ముఖ్యంగా 2026 ప్రారంభంలోనే ఒక పెద్ద యుద్ధం (Great War) మొదలవుతుందని ఆమె జోస్యం చెప్పారు. ప్రస్తుత ఇరాన్-ఇజ్రాయెల్ పరిణామాలు ఆమె చెప్పిన యుద్ధ సూచనలకు దగ్గరగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాణ, ఆస్తి నష్టం భారీ స్థాయిలో సంభవిస్తుందని ఆమె హెచ్చరించారు.
35
తూర్పున మొదలై పడమరకి వ్యాప్తి
బాబా వంగా భవిష్యవాణి ప్రకారం, ఈ మహా యుద్ధం తొలుత తూర్పు దేశాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్రమంగా పశ్చిమ దేశాలకు విస్తరిస్తుంది. దీనివల్ల పశ్చిమ దేశాలకు అత్యధిక నష్టం జరిగే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా యూరప్ ఖండం ఈ యుద్ధం వల్ల అతలాకుతలం అవుతుందని, కొన్ని దేశాలు ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా బలహీనపడతాయని ఆమె అంచనా వేశారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల మధ్య ఉన్న అధికార సమతుల్యత పూర్తిగా మారిపోతుందని బాబా వంగా వివరించారు.
యూరప్ వినాశనం తర్వాత ప్రపంచ రాజకీయ పటంలో పెద్ద మార్పులు వస్తాయని బాబా వంగా చెప్పారు. ఈ గందరగోళ పరిస్థితుల అనంతరం రష్యా ఒక గ్లోబల్ పవర్‌గా అవతరిస్తుందని ఆమె అంచనా వేశారు. రష్యా మరింత బలోపేతం కావడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో అధికార కేంద్రాలు మారిపోతాయని ఆమె మాటల సారాంశం. అయితే, బాబా వంగా చెప్పిన ఈ విషయాలకు సంబంధించి ఎలాంటి అధికారిక లిఖితపూర్వక ఆధారాలు లేవు. ఆమె చెప్పిన మాటలు తరతరాలుగా ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి.
55
ఎవరీ బాబా వంగా ?
1911లో జన్మించిన బాబా వంగా ను 'బాల్కన్ నాస్ట్రడామస్' అని పిలుస్తారు. చిన్నతనంలోనే ఒక పెద్ద తుపానులో చిక్కుకుని ఆమె తన కంటి చూపును కోల్పోయారు. అయితే, చూపు కోల్పోయిన తర్వాత ఆమెకు భవిష్యత్తును చూసే దివ్యశక్తి లభించిందని ఆమెను నమ్మే వారు చెబుతుంటారు. ఆమె చేసిన ఎన్నో అంచనాలు (9/11 దాడులు, సునామీ వంటివి) గతంలో నిజమయ్యాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే ఆమె 2026 గురించి చేసిన హెచ్చరికలు ఇప్పుడు భయం పుట్టిస్తున్నాయి.