లాస్ ఏంజెల్స్ లో తన ప్రైవేట్ జెట్ వద్ద Elon Musk, ఓ యువతితో దిగుతూ కనిపించాడు. పొడుగాటి కోటు, నల్ల కళ్ళద్దాలు ధరించిన ఆ యువతి.. కెమెరాలు కనిపించేసరికి తన ముఖం చాటేసేందుకు ప్రయత్నించింది. ముఖాన్ని కప్పేసుకుని వేగంగా అక్కడి నుంచి పరుగులు అందుకుంది. ఆమెను అనుసరిస్తూ మస్క్ సైతం కారు దగ్గరికి పరుగులు తీశాడు. ఈ తరుణంలో డైలీ మెయిల్ పత్రిక.. మస్క్ తో ఉన్న ఆమె ఆస్ట్రేలియా నటీ Natasha Bassett అని తేల్చింది.