టిఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ, “ఐఎస్‌ఐఎల్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లెవాంట్) ఇంకా ఆఫ్ఘనిస్తాన్‌లో దాని కార్యకలాపాలు కొనసాగడం మాకు ఆందోళన కలిగించే విషయం. ఈ ఉగ్రవాద సంస్థ దేశ విదేశాలలో తన శక్తిని మరియు ప్రభావాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుందనిని చెప్పాడు.
ఆఫ్ఘనిస్తాన్‌లోని యూఎన్ సహాయ మిషన్‌పై టిఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ, 'ఆఫ్ఘనిస్తాన్ అతిపెద్ద ప్రాంతీయ అభివృద్ధి భాగస్వామిగా ఆఫ్ఘనిస్తాన్‌కు అవసరమైన మానవతా సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌కు ఉగ్రవాదం తీవ్ర ముప్పుగా కొనసాగుతోందని అన్నారు.