అదుపుతప్పి.. అమెరికా హైవేపై కుప్పలుగా సుమారు 100 వాహనాలు.. కారణమిదే

First Published Dec 24, 2021, 1:48 AM IST

అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో అక్కడి ఉపరితలాలు మంచును తలపించాయి. పశ్చిమ విస్కాన్సిన్‌లోని ఇంటర్‌స్టేట్ 94 రహదారి కూడా మంచు ఉపరితలంగా మారిపోయింది. ఈ దారి గుండా వెళ్లిన సుమారు వంద వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి.

america

న్యూఢిల్లీ: అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భయంకర చిత్రాన్ని చూపెట్టాయి. విస్కాన్సినన్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఘనీభవనాని కంటే అత్యల్పానికి తగ్గిపోయాయి. దీంతో అక్కడ ప్రతి వస్తువు ఉపరితలం మంచును తలపించేలా మారాయి. ఇంటర్‌స్టేట్ 94 రహదారి పరిస్థితి అదే. ఆ రహదారి చూడ్డానికి తారు రోడ్డులా కనిపించినా.. దాని గుణం మంచుగా మారిపోయింది. అందుకే దాని మీద ప్రయాణించే వాహనాలు రోడ్డుపై కాకుండా మంచుపై జారుతూ వెళ్లినట్టుగా అనిపించాయి.

america

మధ్యప్రాచ్య విస్కాన్సిన్‌లో ఐసీ రోడ్ కండీషన్స్ ఏర్పడ్డాయని పోలీసులు తెలిపారు. ఈ రోజు ఉదయం ఒస్సియో, బ్లాక్ రివర్స్ ఫాల్స్ మధ్య సుమారు 40 కిలో మీటర్ల రోడ్డు పూర్తిగా మంచును తలపించింది. దీంతో దానిపై వెళ్లిన వాహనాలు నియంత్రణ కోల్పోయాయి. దీంతో సుమారు 100 వాహనాలు అదుపు తప్పి ఒకదానికి మరొకటి ఢీకొట్టుకుని అస్తవ్యస్తంగా నిలిచిపోయాయి. రోడ్డంతా ఆ వాహనాలు చిందరవందరగా విసిరేసినట్టుగా ఢీకొట్టుకున్నాయి.

america

దీంతో ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఈ రోడ్డుపై ప్రయాణాన్ని నిలిపేశారు. ఇంటర్‌స్టేట్ 94 రహదారిపై వెళ్లిన మైక్ ఓల్సెన్ ఆయన అనుభవాన్ని వివరించారు. ఆ ఘటన ఊహించినదాని కన్నా స్వల్ప సమయంలోనే జరిగిపోయిందని తెలిపారు. రహదారిపై ట్రాక్టర్లు, సెమీ ట్రాక్టర్లు ఢీకొన్ని అస్తవ్యస్తంగా పడి ఉన్న దృశ్యాలను ఆయన తన కెమెరాలో బంధించాడు. అలాగే, ఆ హైవేపై చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదాన్నీ చిత్రించారు.

america

కాగా, ఈ రోజు రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు జాగ్రత్తలు వహించాలని విస్కాన్సిన్ గవర్నర్ టోనీ ఎవర్స్ ప్రజలను కోరాడు. కొన్ని చోట్ల రోడ్ల పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పాడు. పశ్చిమ విస్కాన్సిన్ ప్రాంతంలో ఓ చోట ప్రమాదకరమైన రోడ్ల పరిస్థితుల వల్ల యాక్సిడెంట్లు జరిగాయని అన్నాడు. కాబట్టి, ఈ రోజు ప్రయాణించాలని భావిస్తే.. జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నాడు.

click me!