గోవా ఎందుకు ఖాళీ అవుతోంది? నా అన్వేషణ అవినాష్‌ ఇస్తోన్న సలహా ఏంటో తెలుసా? 30 రోజుల్లో మార్చేస్తానంటూ..

Published : Mar 16, 2025, 11:44 AM IST

Goa Tourism: నలుగురు స్నేహితులు కలిస్తే గోవా వెళ్దామా.? అన్న టాపిక్‌ తప్పకుండా వచ్చి తీరుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గోవాలో టూరిజం తగ్గుతోందని గణంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ యూట్యూబర్‌ నా అన్వేషణ అవినాష్‌ గోవా టూరిజానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..   

PREV
13
గోవా ఎందుకు ఖాళీ అవుతోంది? నా అన్వేషణ అవినాష్‌ ఇస్తోన్న సలహా ఏంటో తెలుసా? 30 రోజుల్లో మార్చేస్తానంటూ..
YouTuber Avinash from Naa Anveshana

గత కొన్ని రోజులుగా గోవాకు పర్యాటకులు తగ్గుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన గోవాకు ప్రతీ ఏటా వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఇతర దేశాలకు చెందిన విదేశీ పర్యాటకులు సైతం గోవాను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇటీవల గోవాకు పర్యాటకుల సంఖ్య తగ్గుతోందనే వార్తలు వస్తున్నాయి. 'బాయ్‌ కాట్‌ గోవా' అంటూ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నా అన్వేషణ అవినాష్‌ ఈ విషయంపై ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 

23
Naa Anveshana avinash about goa

ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. 'గోవాలో మొన్నటి వరకు 50 శాతం పడిపోయిన టూరిజం ప్రస్తుతం ఏకంగా 80 శాతం పడిపోయింది. అందరూ బాయ్‌ కాట్‌ గోవా, గోవాను బహిష్కరించండి అంటూ పెద్ద ఎత్తున వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇటీవల గోవాకు వచ్చిన బ్రెజిల్‌ యువతిపై 7 మంది అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. మొన్నటికి మొన్న ఓ తెలుగు వ్యక్తిని గోవాలో చంపేశారు. ఇలాంటివి జరిగితే టూరిజం ఎలా డెవలప్‌ అవుతుంది.? దేశం ఆర్థికంగా ఎలా ఎదుగుతుంది.? పక్కన ఉన్న థాయ్‌లాండ్‌ లాంటి దేశాలు అతిథులను ఎంతో గౌరవిస్తున్నారు. అక్కడ అస్సలు మోసం అనేది ఉండదు' అని చెప్పుకొచ్చారు. 

33
Naa Anveshana avinash about goa

నాకు అవకాశం ఇస్తే నెల రోజుల్లో గోవాను మార్చేస్తా: Naa Anveshana avinash 

గోవాలో అన్ని మోసాలే ఉంటాయని అవినాశ్‌ ఆరోపించారు. 'థాయ్‌లాండ్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉండే రాపిడో వంటి వ్యవస్థలు ఉంటాయి. గోవాలో ఇలాంటివి ఏం ఉండవు. అసలు ఆన్‌లైన్‌ వ్యవస్థ అనేదే లేదు. ఇష్టారాజ్యంగా దోచుకుంటారు. ఈ కారణంగా టూరిస్టులు శ్రీలంక, వియత్నం, థాయ్‌లాండ్‌ లాంటి దేశాలను పర్యటిస్తున్నారు. నాకు అవకాశం ఇస్తే ఒక నెల రోజుల్లో గోవాను మార్చేస్తా. ఇందుకోసం పెద్దగా చేయాల్సింది ఏం లేదు. మొత్తం వ్యవస్థను ఆన్‌లైన్‌ చేస్తాను. అసలు బ్రోకర్‌ వ్యవస్థ లేకుండా చేస్తే గోవా టూరిజం పెరగడం ఖాయం' అంటూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. అవినాష్‌ చేసిన వ్యాఖ్యలకు మద్ధతు పలుకుతూ చాలా మంది నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

click me!

Recommended Stories