ఇప్పుడు చిటికలో బెడ్ రూమ్ దారి పట్టే అమ్మాయిలు ఎంతో మంది. 'గొట్టం గాళ్ళు'.. రేడియో జాకీలు .. డబ్బు... పేరు ... తెలివి (చావు తెలివి) ఉన్న ప్రతోడు దున్నుకొంటున్నాడు. ఎప్పుడో వార్తలు బయటకు వస్తాయి . అరెస్ట్ లు జరుగుతాయి . అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోతుంది. కరోనా ముందు కాలం లోనే తార్నాకకు చెందిన ఇంజనీర్ 130 అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అని క్రైమ్ వార్తలు వచ్చాయి . ఇప్పుడు ఈ వస్తాను సాయి ..
ఇంకో రేడియో జాకీ ... అని వార్తలు. మూడు వందలో.. రెండు వందలో.. నంబర్స్ ఎలా ఉన్నా.. వాడు అనేక మందిని ట్రాప్ చేసి ... వారితో సెక్స్ చేసి .. ఆ దృశ్యాలని వీడియో షూట్ చేసి... వారిని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇప్పుడేమయ్యింది ? వాడు అరెస్ట్ అయ్యాడు .... ఈ అమ్మాయిలు ఎవడో బకరా గాడిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యిపోతారు . లేదా కొంతమంది రీల్స్ చేసుకొంటూ బతికేస్తారు . కలికాలంలో ఆకు ... వచ్చి పడినా ముల్లుకే నష్టం " అని మీరు అనుకొంటున్నారు కదా !
నిజం ఏమిటంటే ..
1) వాడు శారీరకంగా కలిసినప్పుడు వారు బాగానే ఎంజాయ్ చేసివుంటారు . కానీ వాడు వీడియోలు చూపి బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టాక వారు ట్రామా కు గురై ఉంటారు. వారికి భవిషత్తులో సెక్స్ ఫీలింగ్స్ రావడం కష్టం . సెక్స్ చేసినా ఉపచేతన మెదడులో నిక్షిప్తమయిన భయం .. బయటకు వస్తుంది . సెక్స్ సమయంలో వారిలో ద్రవాలు స్రవించవు. విపరీతమైన నొప్పి వేస్తుంది.
2) పీడకలలు .. నిద్రలేమి .. అనేక సంవత్సరాల పాటు వారిని వెంటాడుతుంది .
3) తలనొప్పి.. మైగ్రైన్.. అజీర్తి లాంటి సమస్యలు వారికి ఇప్పటికే కామన్ అయిపోయి ఉంటుంది.
4) ట్రామా వల్ల వారికి హార్మోనల్ మార్పులు వస్తాయి . రుతుస్రావం గతితప్పుతుంది . హెవీ బ్లీడింగ్ కామన్ అయిపోతుంది . రేపు వారు గర్భం ధరించే అవకాశం తక్కువ . థైరాయిడ్ సమస్య రావొచ్చు . వస్తే అదో నరకం.
5) పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ .. వ్యాకులత .. మానసిక కుంగుబాటు .. ఇక భవిషత్తులో ఎవరినీ నమ్మరు . పెళ్లి చేసుకోలేరు, చేసుకొన్నా కాపురం నిలవవు. అన్ని సమస్యలు అందరికీ వస్తాయని కాదు . కనీసం ఒకటో మూడో అందులో సింహ భాగం అమ్మాయిలకు గ్యారెంటీ. ఒక రోజు థ్రిల్ .. జీవితం కిల్. ఇక మిగిలింది నిల్ . ఏంటి అమ్మాయిలకే ఈ శిక్ష అనుకొంటున్నారా ?
లింగ బేధాలు లేవు. వయసు తో నిమిత్తం లేదు.