విరాట్‌ కోహ్లి రెస్టారెంట్‌లో ఈ మొక్కజొన్న ఖరీదు ఎంతో తెలుసా.? వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..

First Published | Jan 16, 2025, 2:15 PM IST

పెద్ద పెద్ద హోటల్స్‌లో ధరలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యులు కనీసం ప్రైజ్‌ మెను చూడాలంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. అలాంటి హోటల్స్‌ మన హైదరాబాద్‌లోనూ ఉన్నాయి. అలాంటి ఓ హోటల్‌కు సంబంధించి తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ కథెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

టీమిండియా స్టార్‌ క్రికెట్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదిచుకున్నాడు విరాట్‌. దేశంలో అత్యధిక బ్రాండ్ వ్యాల్యు ఉన్న వ్యక్తుల్లో విరాట్‌ ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. విరాట్‌ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టుకు కోట్లలో చెల్లించే సంస్థలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే విరాట్‌ ఫుడ్‌ బిజినెస్‌లో కూడా ఉన్నారన్న విషయం మీకు తెలుసా.? వన్‌8 కమ్యూన్‌ పేరుతో విరాట్‌ రెస్టారెంట్‌ను రన్‌ చేస్తున్నారు. 
 

ఈ రెస్టారెంట్స్‌ దేశంలో ప్రముఖ నగరాలైన హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు, పుణె, కోల్‌కతా వంటి నగరాల్లో ఉన్నాయి. హైటెక్‌ సిటీలోని నాలెడ్జ్‌ సిటీలో ఉన్న ఈ రెస్టారెంట్‌ తాజాగా వార్తాల్లోకి ఎక్కింది. హైదరాబాద్‌లోని స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కు చెందిన ఓ విద్యార్థిని ఇటీవల వన్‌8 కమ్యూన్‌ రెస్టారెంట్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె బాయిల్డ్‌ మొక్కజొన్న పొత్తులు ఆర్డర్‌ చేసింది. తీరా బిల్లు చూసి ఒక్కసారిగా షాకైంది. ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా పంచుకుంది. 
 


ఇంతకీ ఉడకబెట్టిన ఈ మొక్కజొన్న పొత్తుల ధర ఎంతో తెలుసా? అక్షరాల రూ. 525. ఈ విషయాన్ని తెలుపుతూ, ఆ డిష్‌ ఫొటోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. 'వన్‌8 కమ్యూన్‌లో ఈ ఉడకబెట్టిన మొక్కజొన్న పొత్తుల కోసం ఏకంగా రూ.525 చెల్లించాను' అంటూ చేసిన పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఏకంగా 13 లక్షల మంది ఈ ట్వీన్‌ను చూశారు. ఇకవేల మంది కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో మొక్కజొన్న పొత్తులు ఈ ధర ఎంత ఏంటి అంటూ అందరూ కామెంట్స్‌ చేస్తున్నారు. 
 

ఓ నెటిజన్ వినూత్నంగా కామెంట్‌ చేశాడు. ఈ కామెంట్‌లో ఆయన మొక్కజొన్నకు రూ. 10, ప్లేట్‌కి రూ. 100, గ్లాస్‌కి రూ. 50, టేబుల్‌కి రూ. 50, చెయిర్‌కి రూ. 100, ఏసీకి రూ. 150, ట్యాక్స్‌ రూ. 65 ఇలా అన్ని కలుపుకొని అంత మొత్తం అయ్యిందంటూ ఫన్నీ కామెంట్‌ చేశాడు.

ఇక మరికొందరు స్పందిస్తూ.. ఆర్డర్‌ చేసే ముందు దాని ధర ఎంతో తెలుస్తుంది కదా, తెలిసి మరీ ఆర్డర్‌ చేయడం ఎందుకంటున్నారు. ఇక మరికొందరు స్పందిస్తూ ఆ హాటల్‌లో ఉండే వాతావరణం, పరిశుభ్రత, మెయింటెనెన్స్‌కు ఆ మాత్రం ధర చెల్లించకతప్పదు అంటూ స్పందించారు. 
 

Latest Videos

click me!