అండర్ వేర్ లను ఇస్త్రీ చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

Published : May 13, 2023, 10:23 AM IST

జీన్స్, అంగీలు, టీ షర్ట్ లను మత్రమే ఇస్త్రీ చేస్తుంటారు. ఐరన్ చేయడం  వల్ల ఇవి కొత్తగా, ఎలాంటి ముడతలు లేకుండా చక్కగా కనిపిస్తాయి. వీటితో పాటుగా ఇన్నర్లను కూడా ఐరన్ చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే..? 

PREV
18
అండర్ వేర్ లను ఇస్త్రీ చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

సాధారణంగా చొక్కాలు, జీన్స్, చేతి రుమాలు వంటి వాటినే ఇస్త్రీ చేస్తుంటాం. ఇస్త్రీ చేయడం వల్ల వాటిపై ఉన్న ముడతలు పోయి చూడటానికి చక్కగా కనిపిస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. లోదుస్తులను కూడా ఇస్త్రీ చేయాలి. అవును లోదుస్తులను ఇస్త్రీ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నిజానికి ఇన్నర్లు శుభ్రంగా కనిపించినా.. కంటికి కనిపించని ఎన్నో సూక్ష్మక్రిములు ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ప్రైవేట్ భాగాలపై ఉంచే ముందు మీ లోదుస్తులపై ఉన్న సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా ఎంత మొత్తంలో ఉందో తెలుసుకుంటే నిజంగా షాక్ అవుతారు. 

28

మీకు తెలుసా కొన్ని బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు 60°С డిగ్రీల సెల్సియస్ వరకు కూడా జీవించగలవు. సున్నితమైన లోదుస్తులను ఎక్కువ వేడి నీటిలో ఉతకలేము. అందుకే వాటిని వాష్ చేసిన తర్వాత ఐరన్ చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే దీనివల్ల వాటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. 
 

38

వాషింగ్ మెషీన్ లోని బ్యాక్టీరియా

వాషింగ్ మెషీన్ లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. ఇ.కోలి, సాల్మొనెల్లా, స్టెఫిలోకోకస్ ఆరియస్ వంటి మరెన్నో రకాల బ్యాక్టీరియాలను మన వాషింగ్ మెషీన్ పునరుత్పత్తి చేయగలదు. మనం ఉతికే మురికి బట్టలే ఈ క్రిములకు మూలాలు.
 

48

గుడ్ హౌస్ కీపింగ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. శుభ్రమైన లోదుస్తుల్లో కూడా 10,000 సజీవ బ్యాక్టీరియా ఉంటుంది. వాషింగ్ మెషీన్ లోని కేవలం 2 టేబుల్ స్పూన్ల వాడిన నీటిలో పది లక్షల బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మీ బట్టల్లోకి చేరుకుంటుంది. 
 

58

లోదుస్తులు బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తాయి

నిజం చెప్పాలంలో మురికి బట్టల్లో లోదుస్తులు కూడా ఒకటి. అందులోనూ మల పదార్థం కూడా వీటికి అంటుకునే ఛాన్స్ ఉంది. ఇవి హెపటైటిస్ ఎ వైరస్, నోరోవైరస్, రోటావైరస్, సాల్మొనెల్లా, ఇ. కోలి వంటి అనేక విభిన్న సూక్ష్మక్రిములను కలిగి ఉంటాయి.

68

యుటిఐని నివారించడానికి 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి ఇస్త్రీ ఎంతగానో సహాయపడుతుంది. మీకు ప్రస్తుతం ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య ఉంటే.. మీ లోదుస్తులను వేసుకునే ముందు వాటిని ఐరన్ చేయడం మర్చిపోకండి. 

78

లోదుస్తులను ఎలా ఐరన్ చేయాలి?

లోదుస్తులు సన్నని, సున్నితమైన బట్టలతో తయారవుతాయి. అందుకే వీటిని జాగ్రత్తగా ఐరన్ చేయాలి. ఉతికి లోదుస్తులు ఎండలో సరిగ్గా ఆరిన తర్వాత దాని ఫ్యాబ్రిక్ ఏంటో చెక్ చేయండి. దానికి అనుగుణంగా ఐరన్ టెంపరేచర్ ను సెట్ చేయండి. వీటిని ఇస్త్రీ చేసి మడతపెట్టి డ్రాయర్ లో పెట్టండి.
 

88

అలాగే మీ లోదుస్తుల డ్రాయర్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. మూలల్లో దుమ్ము పేరుకుపోకుండా చూసుకోండి. కనీసం ప్రతి సంవత్సరానికి మీ లోదుస్తులను ఖచ్చితంగా మార్చండి. 

click me!

Recommended Stories