ఆ రోగాలు తగ్గాలంటే వీటిని మరువకుండా తినండి..

Published : May 13, 2023, 07:15 AM IST

విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్లన్నీ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు గుండె, క్యాన్సర్ కణాలను తొలగించడానికి సహాయపడతాయి.   

PREV
17
ఆ రోగాలు తగ్గాలంటే వీటిని మరువకుండా తినండి..

మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో యాంటీఆక్సిడెంట్లు ఒకటి. అయితే చాలా మందికి వీటి గురించి తెలుసు . కానీ వీటి ప్రాముఖ్యత గురించి మాత్రం తెలియదు. నిజానికి ఈ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ తో సహా ఎన్నో వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. 

27

విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్లు అన్నీ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు గుండె, క్యాన్సర్ కణాలను తొలగించడానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏయే ఆహారాల్లో పుష్కలంగా ఉంటాయంటే.. 

37
apples

ఆపిల్

ఆపిల్ పండులను తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, ఉబ్బసం, అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఈ వ్యాధుల నుంచి రక్షించడానికి ఆపిల్ సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆపిల్స్ డయాబెటిస్, వెయిట్ లాస్, ఎముకల ఆరోగ్యం, ఊపిరితిత్తులు, గట్ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

47
Image: Getty Images

బెర్రీలు

బ్లూబెర్రీలు, బ్లాక్బెర్రీలు, క్రాన్బెర్రీలు, కోరిందకాయలు లేదా స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లకు మంచి వనరు. వీటిలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
 

57

వాల్ నట్స్

వాల్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, డైటరీ ఫైబర్ వంటి చాలా ముఖ్యమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ వాల్ నట్స్ లో పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి.
 

67
green tea

గ్రీన్ టీ

గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు కాటెచిన్స్ ఊపిరితిత్తులు, రొమ్ము, అన్నవాహిక, కడుపు, కాలేయం, ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్ క్యాన్సర్ తో సహా ఎన్నో రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న గ్రీన్ టీ రోగనిరోధక పనితీరుకు మద్దతునిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

77
Image: Getty Images

గింజలు

అన్ని గింజలలో పాలీఫెనాల్స్ అని పిలువబడే బలమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాల్ నట్స్, పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. గింజలలోని యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఎముక, మెదడు ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి.

click me!

Recommended Stories