పరిగెత్తి పాలు తాగే కంటే, నిలపడి నీళ్లు తాగడం ఉత్తమం అని మన పెద్దలు చెప్పేవారు. కానీ, తాజాగా తేలిన విషయం ఏమిటంటే నిలపడి నీళ్లు తాగకూడదట. దాని వల్ల చాలా సమస్యలు వస్తాయని చెబుతున్నారు. నిలబడి నీరు త్రాగడం మన జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుందని, అది నాడీ వ్యవస్థను నాశనం చేస్తుందని, నిలబడి ఉన్న స్థితిలో నీరు శరీరంలోకి వెళ్లే వేగాన్ని పెంచుతుందని, ఇది మన ఆరోగ్యానికి ఒక విధంగా హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.