చిన్నపిల్లలు ఎప్పుడు మాస్కు వేసుకుంటే కలిగే నష్టలు ఇవే!

First Published Jan 11, 2022, 6:03 PM IST

కరోనా వైరస్ (Corona virus) వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలలో మాస్క్ ధరించడం ఒకటి. అయితే ఈ వైరస్ ప్రభావం (Effect) పిల్లలపై కూడా ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. కాబట్టి చిన్నపిల్లలు మాస్కు   ధరించవచ్చా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

ప్రస్తుత కాలంలో ఈ వైరస్  బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అందుకు వైద్య నిపుణులు మాస్క్ ధరించడం (Wearing a mask), భౌతిక దూరం పాటించడం (Physical Distance) తప్పనిసరి అని అంటున్నారు. అయితే చిన్న పిల్లలు మాస్కులు ధరించడం పై కేంద్రం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
 

చిన్న పిల్లలను వారి వయసును బట్టి మూడు గ్రూపులుగా విభజించి కొత్త మార్గదర్శకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) విడుదల చేసింది. అయితే 5 సంవత్సరాల లోపు పిల్లలు మాస్కు ధరించాల్సిన అవసరం (Required) లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త మార్గదర్శకాలను తెలిపింది.
 

ఈ వయసు పిల్లలకు కరోనా సోకే ప్రభావం (Infectious effect) తక్కువగా ఉంటుందని తెలిపింది. 6 నుంచి 11  సంవత్సరాల పిల్లలు వారు ఉండే ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటేనే మాస్కులు (Masks) ధరించాలి. తల్లిదండ్రుల, సంరక్షకుల పర్యవేక్షణలో ఈ వయసు పిల్లలు మాస్కులు ధరించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
 

ఈ వయసు పిల్లలకు మాస్కులు ఎలా ధరించాలి, తీయాలో అనేది పెద్దలు సరైన అవగాహన (Awareness) కల్పించాలి. జనాభా రద్దీగా ఉన్న ప్రదేశంలో ఈ వయసు పిల్లలు మాస్కులు ధరించడం తప్పనిసరి (Mandatory). అయితే ఆడుకునే సమయంలో మాస్కులను ధరించాల్సిన అవసరం లేదు.
 

ఆడుకునే సమయంలో భౌతిక దూరం పాటిస్తే మంచిది. ఎవరైనా ఇంటిలో అనారోగ్యంగా (Illness) ఉన్నప్పుడు 6 నుంచి 11 సంవత్సరాల పిల్లలు మాస్క్ ధరించడం తప్పనిసరి. 12 ఏళ్ల పైబడిన పిల్లలు పెద్ద వారి మాదిరిగానే తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. మాస్కులను వాడే సమయంలో చేతులను శుభ్రంగా కడుక్కోవడం (Washing hands thoroughly), శానిటైజర్ తో శుభ్రపరుచుకోవడం తప్పనిసరి.
 

అయితే చిన్న పిల్లలలో కూడా కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించాలి.  కరోనా రూల్స్ (Corona Rules) ను వారికి తెలియజేస్తూ, కరోనా వైరస్ కు దూరంగా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారికి సరైన అవగాహన కల్పించాలి. పిల్లలకు ఎటువంటి అనారోగ్య సమస్యలేమైనా ఉంటే వారు మాస్క్ ధరించడం సరైనదా కాదా అని వైద్యులను సంప్రదించడం (Contacting) తప్పనిసరి.
 

వైద్య నిపుణుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల ఆరోగ్యానికి (Health) మంచిది. ఈ ప్రస్తుత కరోనా సమయంలో పిల్లలకు అందించే ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. పిల్లలలో వ్యాధినిరోధక శక్తి (Immunity) పెరిగేందుకు తగిన పౌష్టికాహారాన్ని వారికి అందించాలి. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. అప్పుడే కరోనా వంటి భయంకర వైరస్ ల నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు.

click me!