ఆకాశంలో ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయో మన ఆహారం ప్లేట్ లో కూడా అన్ని రంగులు ఉంటే మన ఆరోగ్యం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది. అందుకే మీ ప్లేట్లో ఏడు రంగుల భోజన పదార్థాలు ఉండేలాగా చూసుకోండి. దీనినే రెయిన్ బో డైట్ అంటారు. దీనివల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఈ రెయిన్ బో డైట్ అనేది ఇప్పుడు చాలా పాపులర్. ఇదేదో ఖర్చుతో ముడిపడిన వ్యవహారం అనుకోకండి. మామూలుగా మనకి దొరికే ఆహార పదార్థాల్లోనే ఈ రంగులో ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఎరుపు రంగులో ఉండే ఆహారం తీసుకోవడం వలన మనం గుండెజబ్బు..
క్యాన్సర్ వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అందుకే టమాటో, ఆపిల్, దానిమ్మ పండ్లు తీసుకుంటే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. అలాగే పసుపు రంగు ఆహారంలో బ్రోమిలైన్ పాపైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది.
దీని వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. అందుకే పసుపు రంగు కోసం బొప్పాయి, మొక్కజొన్న, నిమ్మకాయలు వంటి ఆహారం తీసుకోవాలి. అలాగే తెలుపు రంగు ఆహారంలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. అందుకే ముల్లంగి, పాలు, పెరుగు, కొబ్బరి లాంటి తెల్లని ఆహార పదార్థాలు తీసుకోవాలి.
అలాగే ఆకుపచ్చ ఆహారంలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బు నివారిస్తుంది. ఆకుకూరలన్నీ ఈ ఆకుపచ్చ రంగులోకి వస్తాయి కాబట్టి ఎక్కువగా ఆకుకూరలు తీసుకోండి. అలాగే నీలం రంగు ఆహారం మెదడు సామర్థ్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే ప్రోటీన్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే నల్ల ద్రాక్ష వంకాయ, బెర్రీలు తీసుకోవటం చాలా అవసరం.
అలాగే ఆరెంజ్ కలర్ ఆహార పదార్థంలో కెరోటెన్ ఉంటుంది. ఇది కంటిచూపుకి చాలా మంచిది కాబట్టి క్యారెట్, ఆరెంజ్, గుమ్మడి వంటివి తీసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ మనకి దొరికే వస్తువులే. కాబట్టి అశ్రద్ధ చేయకుండా అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోండి.