భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగొచ్చా? ఈ విషయాలను మాత్రం నమ్మకండి

First Published | May 18, 2024, 2:53 PM IST

కొంతమంది భోజనం చేసేటప్పుడు ఒక్క చుక్క నీళ్లను తాగరు. భోజనం మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతే తాగుతారు. కానీ కొంతమంది బుక్క బుక్కకు నీళ్లు తాగుతూనే ఉంటారు. కానీ ఇలా తాగడం మంచిది కాదని చెప్తుంటారు. మరి దీనిలో ఉన్న నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

drink water

భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా నీళ్లను తాగాలనిపిస్తుంది. కానీ కొంతమంది తినేటప్పుడు నీళ్లను అస్సలు తాగకూడదంటుంటారు. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయని నమ్ముతారు. నిజానికి భోజన సమయంలో నీరు తాగడం చుట్టూ ఎన్నో అపోహలు ఉన్నాయి. ఆ అపోహలేంటి? వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

అపోహ: తినేటప్పుడు నీళ్లు తాగితే జీర్ణ రసాలు పలుచగా అవుతాయి.జీర్ణక్రియ బలహీనపడుతుంది.

వాస్తవం: ఇదొక అపోహ మాత్రమే. కానీ దీనిలో కొంత నిజం ఉంది. అయితే మీరు వేడి లేదా గోరువెచ్చని నీళ్లను తాగితే మాత్రం జీర్ణ రసాలు మరీ పలుచగా కావు. అలాగే జీర్ణక్రియ కూడా దెబ్బతినదు. నిజానికి  భోజనం సమయంలో వేడి  లేదా గోరువెచ్చని నీటిని సిప్ చేయడం వల్ల ఆహార పదార్థాలు విచ్చిన్నం అవుతాయి. అలాగే పోషక శోషణ సులభతరం అవుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయినప్పటికీ భోజనం చేసేటప్పుడు నీళ్లను ఎక్కువగా తాగితే కడుపు తొందరగా నిండుతుంది. మీకు సంపూర్ణంగా తిన్న భావన కలగదు. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. భోజనం చేసేటప్పుడు గరిష్టంగా 100 మిల్లీ లీటర్ల గోరువెచ్చని నీటిని నెమ్మదిగా తాగాలని సిఫార్సు చేయబడింది. చల్లటి నీరు లేదా గది ఉష్ణోగ్రత నీటిని తాగడం వల్ల మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. 


అపోహ: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే బరువు తగ్గుతారు

వాస్తవం:  భోజనం చేసిన వెంటనే నీళ్లను తాగడం బరువు నిర్వహణకు సహాయపడుతుందనే భావనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. నీటిలో కేలరీలు ఉండవు. అలాగే కడుపులో ఆహారం పరిమాణం లేదా బరువును పెంచుతుందని, ఇది దీర్ఘకాలిక సంతృప్తికి దారితీస్తుందని కొందరు అంటుంటారు. కానీ దీనిలో నిజం లేదు. భోజనం తర్వాత జీర్ణ ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమయంలో నీళ్లను ఎక్కువగా తాగితే జీర్ణప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. ఇది మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. 

అపోహ: చల్లటి నీరు జీర్ణక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

వాస్తవం: కూల్ వాటర్ జీర్ణక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. చల్లటి నీరు ఆహారంలో కొవ్వులను గట్టిపరుస్తుందని కొందరు నమ్ముతారు.  కానీ ఇది ఐస్ వాటర్ కు మాత్రమే వర్తిస్తుంది. ఐస్ వాటర్ ను తాగితేనే కొవ్వు గట్టిపడుతుంది. అలాగే ఇది మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. అందుకే నార్మల్ వాటర్ ను తాగడం సాధారణంగా భావిస్తారు. ఇది మీ జీర్ణక్రియను కూడా ఏ విధంగానూ ప్రభావితం చేయదు.

అయితే మీరు భోజనం చేసేటప్పుడు ఐస్ వాటర్ కు దూరంగా ఉండండి. అలాగే భోజనం చేసేటప్పుడు నీళ్లను మరీ ఎక్కువగా తాగకండి. నీళ్లను భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు , భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత తాగడం ఆరోగ్యకరమైంది. వీలైతే గోరువెచ్చని నీటిని తాగండి. 

Latest Videos

click me!