షుగర్ ను తగ్గించడానికి ఏం చేయాలి?

First Published May 30, 2024, 11:45 AM IST

డయాబెటిస్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా మన దేశంలో కొంతకాలంగా ఈ వ్యాధి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ వ్యాధి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది. 
 

ఫాస్ట్ గా మారుతున్న జీవన శైలి వల్ల నేడు చాలా మంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా భారత్ లో గత కొన్నేళ్లుగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య బాగా పెరుగుతోంది. డయాబెటిస్ నయం చేయలేని ఒక వ్యాధి. దీనిని మందులు, జీవనశైలి మార్పులతో నివారించొచ్చు.  ఈ వ్యాధి ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అయితే కొన్ని రకాల ఆకులు బ్లడ్ షుగర్ ను నియంత్రించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే? 

కరివేపాకు

కరివేపాకును సాధారణంగా ఫుడ్ టేస్ట్ ను పెంచడానికి బాగా ఉపయోగిస్తారు. అయితే ఈ కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లకు. అవును దీన్ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా నియంత్రిస్తుంది. 
 

Latest Videos


కాకరకాయ ఆకులు

కాకరకాయ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అంతేకాదు కాకరకాయ ఆకులు కూడా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ ఆకులు మధుమేహులకు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

పుదీనా ఆకులు

పుదీనా ఆకుల్లో ఔషదగుణాలుంటాయి. వీటిలో మాంగనీస్, ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పుదీనా ఆకులు డయాబెటిక్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరచడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. 

బచ్చలికూర

ఐరన్, ఫైబర్ మెండుగా ఉండే బచ్చలికూర కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వీటిని మీ ఆహారంలో చేర్చడం వల్ల ఇనుము లోపం పోతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 
 

వేప ఆకులు

వేప ఆకులు డయాబెటీస్ పేషెంట్లకు మంచి ఔషదంలా పనిచేస్తాయి. ఈ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. 

ashwagandha

అశ్వగంధ

అశ్వగంధను ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇదొక మంచి హెర్బ్. దీనిని ఇండియన్ జిన్సెంగ్ అని కూడా పిలుస్తారు. అలాగే ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

click me!