సైలెంట్ హార్ట్ ఎటాక్ ను ముందుగా గుర్తించడమేలాగో తెలుసా?

First Published | Aug 20, 2024, 2:42 PM IST

గుండెపోటు ఎప్పుడొస్తుంది? ఎందుకు వస్తుంది? అసలు దీన్ని ఎలా గుర్తించాలి? గుండెపోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

heart attack

ఈ రోజుల్లో ఒక్క వృద్ధులకే కాదు.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ  హార్ట్ ఎటాక్ వస్తోంది. గుండెపోటు వయస్సు, లింగంతో సంబంధం లేకుండా వస్తోంది. నిజానికి గుండెపోటు వచ్చినా ప్రాణాలతో బయటపడొచ్చు. అదికూడా గుండెపోటు వచ్చే ముందు దానిలక్షణాలను గుర్తించి హాస్పటల్ కు వెళితే. కానీ చాలా మందికి వీటి గురించి తెలియదు. అందుకే చాలా మంది దీని బారిన పడి చనిపోతున్నారు. 

గుండెపోటు వచ్చిన చాలా మందికి వేరే ఏం లక్షణాలు లేకుండా.. శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి లేదా మైకం వంటి కొన్ని తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఛాతి నొప్పి ఒక్క గుండెపోటు వల్లే రాదు. కానీ ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అసలు గుండెపోటు రావడానికి ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


విపరీతమైన అలసట

ఎలాంటి కారణం లేకుండా ఎప్పుడూ అలసిపోవడం, అలసిపోయినట్టుగా అనిపించడం సైలెంట్ హార్ట్ ఎటాక్ సంకేతమంటున్నారు డాక్టర్లు. గుండె బలహీనంగా ఉన్నప్పుడు తన శక్తిని శరీరం నుంచి నేరుగా లాగుతుంది. దీనివల్ల అలసట వస్తుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

మన శారీరక కదలిక సరిగ్గా లేకపోవడం, శ్వాస ఆడకపోవడం, నెమ్మదిగా గుండె కొట్టుకోవడం వంటివన్నీ హార్ట్ ఎటాక్ కు లక్షణాలు. గుండె పనితీరు తగ్గినప్పుడు, శరీరానికి తక్కువ ఆక్సిజన్ అందుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికలుగుతుంది. 
 


శరీరంలో అసౌకర్యం

సైలెంట్  హార్ట్ ఎటాక్ వల్ల మెడ, చేతులు, దవడ లేదా వీపు వంటి ఎగువ శరీరంలో నొప్పి ఉంటుంది. లేదా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలా జరిగితే సైలెంట్ హార్ట్ ఎటాక్ అని గుర్తించి హాస్పటల్ కు వెళ్లాలి. ఈ రకమైన నొప్పి కొద్దిగా లేదా ఎక్కువగా ఉంటుంది. 


విపరీతమైన చెమటలు

చల్లని ప్రదేశంలో ఉన్నా, లేదా మీరు ఏమీ చేయకున్నా విపరీతంగా చెమటలు పట్టడం సాధారణ విషయం కాదు. ఇది ఒక హెచ్చరిక. అవును సాధారణం కంటే ఎక్కువ చెమటలు పట్టడం గుండె సమస్యకు సంకేతమంటున్నారు డాక్టర్లు. మీ గుండె ఒత్తిడికి గురైనప్పుడు శరీరం ఎక్కువగా చెమటలు పడుతుంది. దీనితో పాటుగా గుండెపోటు ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. 

వికారం, మైకం

ఎప్పుడూ వికారంగా, తలనొప్పిగా లేదా మైకంగా అనిపించడం కూడా మంచి విషయం కాదు. ఇది మీ గుండె పనితీరు సరిగ్గా లేదని చూపిస్తుంది. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు రక్తపోటు పడిపోతుంది. అలాగే మైకంగా అనిపిస్తుంది. 

Latest Videos

click me!