
భారతదేశాన్ని ప్రపంచ డయాబెటిస్ రాజధాని అని అంటారు. మన దేశంలో సుమారుగా 77 మిలియన్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. కాగా స్థూలకాయం అనేది డయాబెటిక్ పేషెంట్లలో ఎక్కువగా కనిపించే సాధారణ సమస్య. బీఎమ్ఐ కంటే ఉదర ఊబకాయం డయాబెటిక్ ప్రమాదానికి ఎక్కువ దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. స్థూలకాయం ఉన్న డయాబెటీస్ పేషెంట్లకు గుండె జబ్బులు, స్ట్రోక్, నరాల, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
పర్యావరణ మార్పులు, జీవనశైలి మార్పులతో పాటుగా జన్యుపరమైన కారకాలు, కేలరీల ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం, తక్కువ శారీరక శ్రమ కారణంగా ఊబకాయం, డయాబెటిస్ రెండింటి ప్రాబల్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటీస్ బరువు తగ్గేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తినండి
శుద్ధి చేసిన చక్కెర, స్వీట్లు, కోలా, రసాలు వంటి సాధారణ కార్బోహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించండి. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచుతాయి. వైట్ రైస్, వైట్ బ్రెడ్, పిజ్జా, పేస్ట్రీలు, పాస్తా వంటి ప్రాసెస్ చేసిన, శుద్ధి చేసిన ఆహారాలను తినడాన్ని తగ్గించండి. వీటిలో ఫైబర కంటెంట్, పోషకాలు తక్కువగా ఉంటాయి. కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే మీరు వేగంగా బరువు పెరుగుతారు.
తక్కువ జీఐ ఉన్న ఆహారాన్ని తీసుకోండి
గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. పప్పుధాన్యాలు, పప్పులు, పాలు, సోయాబీన్ వంటి తక్కువ జీఐ అంటే 55, అంతకంటే తక్కువున్న ఆహారాలను తినండి. అయితే గోధుమలు, బియ్యం, రూట్ వెజిటేబుల్స్, కోలాలు, నూడుల్స్ వంటి అధిక జీఐ అంటే 70 కంటే ఎక్కువ ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. అందుకే వీటిని తీసుకోవడం మానేయండి.
ఫైబర్
తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, చిక్కుళ్లు, కాయలు, పండ్లు, కూరగాయలు, అవిసె గింజలు, మెంతి గింజలు, ఓట్ మీల్ వంటి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నఆహారాన్ని మీ భోజనంలో చేర్చండి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం కడుపును తొందరగా నింపుతుంది. దీంతో మీరు ఫుడ్ ను తీసుకోవడం చాలా వరకు తగ్గిస్తారు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
తక్కువ సార్లు తినండి
నిపుణుల ప్రకారం.. మార్కెట్ నుంచి కొన్ని వాటిని కాకుండా ఇంట్లోనే కాల్చిన వస్తువులను తినండి. ఇది చక్కెరలను మాత్రమే కాకుండా హైడ్రోజనేటెడ్ ఆయిల్ ను కూడా తగ్గించడానికి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
అతిగా వద్దు
మీకు ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా సరే ఎక్కువగా తినకండి.
మీ ఫుడ్ ప్లేట్ చిన్నగా ఉండేలా చూసుకోండి. అంతేకాదు ఎక్కువ సేపు నమలండి. ఫుడ్ ను ఎక్కువ సేపు తినండి. ఇది మీరు తక్కువ తినడానికి సహాయపడుతుంది.
మీరు నాన్ వెజ్ తింటే సన్నని మాంసాలు, చేపలనే ఎక్కువగా తినండి.
క్రీమీ గ్రేవీ వెజిటేబుల్స్ కు బదులుగా ఉడికించిన, వేయించి లేదా గ్రిల్డ్ వెజిటేబుల్స్ తీసుకోండి.
మరింత చురుకుగా ఉండండి
శారీరక శ్రమ మీ బరువును నియంత్రించడానికి మీకు సహాయపడుతుంది. శక్తి కోసం మీ శరీరం చక్కెరను ఉపయోగిస్తుంది. శరీరం ఇన్సులిన్ ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల మితమైన లేదా 75 నిమిషాల శక్తివంతమైన ఏరోబిక్ కార్యకలాపాలు లేదా మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయండి. తొందరగా బరువు తగ్గుతారు.