ఉదయాన్నే టీ తాగే అలవాటు చాలా మందికే ఉంటుంది. ఒత్తిడి పెరిగినప్పుడు, పని ఎక్కువైనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, బంధువులు వచ్చినప్పుడు ఇలా ప్రతిదానికి టీ ని తాగుతుంటారు కొంతమంది. నిజానికి టీ కూడా మన ఆరోగ్యానికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దీనిలో రోగనిరోధక శక్తి, జీవక్రియను పెంచే కాటెచిన్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే బెడ్ టీ తాగడం చాలా భారతీయ కుటుంబాలలో ఒక సాధారణ పద్ధతి. టీ చాలా టేస్టీ, ఓదార్పు పానీయం. అయితే దీనిలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో హాని కలిగిస్తుంది.