పొట్ట దగ్గర కొవ్వు త్వరగా కరిగించాలా..? ఈ ఫుడ్స్ తీసుకోండి.

First Published Sep 15, 2020, 12:56 PM IST

మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల ఫుడ్స్ ని తీసుకుంటే.. ఆటోమెటిక్ గా బరువు తగ్గడం.. పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆఫుడ్స్ ఏంటో.. మనమూ ఓసారి చూసేద్దామా..
 

పొట్ట దగ్గర కొంచెం కూడా కొవ్వు లేకుండా.. సన్నని నడుముతో అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అయితే.. ప్రస్తుత కాలంలో అందరూ జంక్ ఫుడ్స్ కి, ఫాస్ట్ ఫుడ్స్ కి బాగా అలవాటు పడిపోయి.. వాటిని తినడం అలవాటు చేసుకున్నారు.
undefined
ఈ క్రమంలో.. పొట్టచుట్టూ.. నడుము వద్ద కొవ్వు బాగా పెరిగిపోతోంది. దీంతో.. ఆ కొవ్వును తగ్గించడానికి ఎన్ని జిమ్స్ చుట్టూ తిరిగినా.. పెద్దగా ఉపయోగం ఉండటం లేదు.
undefined
అయితే.. మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల ఫుడ్స్ ని తీసుకుంటే.. ఆటోమెటిక్ గా బరువు తగ్గడం.. పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆఫుడ్స్ ఏంటో.. మనమూ ఓసారి చూసేద్దామా..
undefined
1. గ్రేప్ ఫ్రూట్.. ఈ ఫ్రూట్.. బరువు తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతోంది. దీనిలో ఉండే న్యూట్రీషన్స్ సులుభంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో.. కొవ్వు త్వరగా కరుగుతుంది. అంతేకాకుండా.. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. దీనిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ని కరిగిస్తుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి ని కూడా పెంచుతుంది. దీంట్లో.. క్యాలరీలు తక్కువ న్యూట్రీషన్స్ ఎక్కువగా ఉంటాయి.
undefined
2. యాపిల్స్.. ఫైబర్ ఎక్కువగా ఉండే మరో పండు.. యాపిల్స్. ఈ యాపిల్స్ నడుముకి చాలా మంచివి. ఇది పొట్ట దగ్గర కొవ్వు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
undefined
3.బీన్స్: బీన్స్ ప్రోటీన్ కి మంచి సొల్యూషన్. ఇది మీ జీవక్రియను పెంచుతుంది మరియు తక్కువ కేలరీలు తినడానికి మీకు సహాయపడుతుంది. పొట్ట దగ్గర కొవ్వును తగ్గించడంలో ఈ ప్రోటీన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. బీన్స్‌లో ప్రోటీన్ అధికంగా ఉండటమే కాదు, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.
undefined
4.నట్స్: ప్రతిరోజూ కొన్ని గింజలు తినడం వల్ల ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ గింజలు ఫైబర్, ప్రోటీన్ మరియు ఇతర పోషకాలతో నిండి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అతిగా తినడం వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పొట్ట దగ్గర కొవ్వును నివారించడంలో ఇవి సహాయపడతాయి.
undefined
5.పెరుగు.. మీకు తెలుసో తెలీదో.. పెరుగు తినడం వల్ల కూడా బరువు తగ్గుతారు. పొట్ట, నడుము దగ్గర కొవ్వు తగ్గించంలో ఇది కీలక పాత్రపోషిస్తుంది. బరువు తగ్గడానికి కావాలసిన కీలకమైన మాక్రోన్యూట్రియెంట్‌గా పెరుగులో ఎక్కువగా ఉంటుంది. అయితే.. సాధారణ పెరుగు మాత్రమే తినాలి. మళ్లీ మేగడ పెరుగు తింటే.. కొవ్వు పెరిగిపోయే ప్రమాదం ఉంది.
undefined
6. వీటితోపాటు మీ బరువు తగ్గడానికి బెర్రీలు, బాదంపప్పులను కూడా మీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
undefined
click me!