కడుపుతో ఉన్న ఆడవాళ్ళు డయాబెటిక్ అయితే అది చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన సమయం. సాధారణంగా గర్భంలో ఉన్నప్పుడు చాలా రకాల ఆహార పదార్థాలు తినాలనిపిస్తుంది. అయితే డయాబెటిక్ పేషెంట్లు అన్ని ఆహారాలను తినలేరు.
అయితే ఈ డయాబెటిక్ ప్రెగ్నెంట్ కి స్వీట్ తినాలనిపిస్తే ఏ మాత్రం సంతోషం లేకుండా ఇలాంటి స్వీట్స్ ని మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అదేమిటో చూద్దాం. మూంగ్ దాల్ చాట్.. ఇది తినటానికి రుచిగా ఉండి ఫైబర్ ప్రోటీన్లతో నిండిన అల్పాహారము. ఇది మధ్యాహ్నం స్నాక్స్ కి చాలా బాగుంటుంది.
మసాలా దినుసుల కలయిక సంతృప్తికరమైన మరియు ఆరోగ్యకరమైన ఈ స్నాక్ మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగనివ్వదు. అలాగే వెజిటబుల్ పోహా కట్లెట్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మిశ్రమ కూరగాయలతో చేయటం వలన క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకి ఉత్తమమైన చిరు తిండి. అలాగే భారతీయ వంటకాలలో పరాటాలు ప్రధానమైనవి. అలాగే బచ్చలి కూర లో ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫైబర్ ని, ప్రోటీన్ ని అందిస్తుంది ఈ స్నాక్. మధుమేహం ఉన్న గర్భిణీ స్త్రీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
అలాగే గర్భిణీ సమయంలో కొన్ని ఫ్రైలను తినాలని అనిపిస్తుంది అయితే కొవ్వు, షుగర్ కంటెంట్ల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు అయితే కాల్చిన స్వీట్ పొటాటో ఫ్రై మీ భయాలని దూరం చేస్తుంది. ఇది షుగర్ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి సంకోచం లేకుండా తినగలిగే ఫ్రై.
కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకొని అలాంటి ఆహారాన్ని తీసుకోవటం ఉత్తమం. అంతేకానీ షుగర్ కంటెంట్ పెరిగిపోతుందని తిండి తినకపోతే సరి అయిన పోషణ అందక ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.