Skin care: ఇలా చేస్తే చాలు.. మీ చర్మం అందంగా మెరిసిపోతుంది!

Published : Feb 13, 2025, 03:25 PM ISTUpdated : Feb 14, 2025, 01:30 PM IST

అందమైన, మృదువైన చర్మం కోసం అమ్మాయిలు రకరాకల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ సీజనల్ ఫ్రూట్స్ తో కూడా చర్మాన్ని మెరిసిపోయేలా చేసుకోవచ్చని మీకు తెలుసా? నాచురల్ గా మీ అందాన్ని మరింత పెంచే ఆ చీట్కాలెంటో ఒకసారి చూసేయండి.  

PREV
110
Skin care: ఇలా చేస్తే చాలు.. మీ చర్మం అందంగా మెరిసిపోతుంది!

చర్మం ఆరోగ్యంగా ఉండడానికి చాలామంది రకరకాల క్రీములు, ఫేస్ ప్యాకులు, లోషన్లు వాడుతుంటారు. వాటిలో ఎక్కువశాతం కెమికల్స్ ఉంటాయి. కానీ నాచురల్ గా సీజనల్ ఫ్రూట్స్ తోటి చర్మాన్ని మెరిసిపోయేలా చేయవచ్చు. ఆ పండ్లు ఏంటో మీకు తెలుసా?

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు చర్మం, జుట్టు సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయట. విటమిన్ సి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా, శుభ్రంగా చేస్తాయి. ఆ పండ్లెంటో ఇప్పుడు చూద్దాం.

210
నారింజతో చర్మ సంరక్షణ

నారింజ రసం ఫేస్ ప్యాక్

నారింజ పండ్లంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ నారింజ రసంలో ఒక టీస్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించండి.15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

310
నారింజ తొక్క ఫేస్ ప్యాక్

నారింజ తొక్కను బాగా కడిగి ఎండలో ఆరబెట్టండి. దాన్ని మెత్తగా పొడి చేయండి. ఒక టీస్పూన్ నారింజ తొక్క పొడిని రెండు టీస్పూన్ల పెరుగుతో కలిపి 10 నిమిషాలు ముఖానికి పట్టించండి.

410
చర్మం కాంతివంతగా

10 నిమిషాల తర్వాత బాగా మసాజ్ చేసి కడిగేయండి. నారింజ తొక్కతో తయారుచేసిన ఈ ప్యాక్ చర్మాన్ని కాంతివంతం చేయడమే కాకుండా మృత కణాలను కూడా తొలగిస్తుంది.

510
పొడి చర్మానికి తేనె

మీకు పొడి చర్మం ఉంటే, తేనెను కూడా ఉపయోగించవచ్చు, ఇది చర్మంలో తేమను కాపాడుతుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

610
బొప్పాయి ఫేస్ ప్యాక్

పూర్తిగా మగ్గిన బొప్పాయిన తొక్క తీసి ముక్కలు చేసి బాగా మెత్తగా చేయండి. ఇందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు ముఖానికి పట్టించండి.

మృతకణాలు తొలగిపోయి చర్మం ఎలా మెరుస్తుందో మీరే చూడవచ్చు. కానీ ఒక రోజు ఉపయోగించి ఆపేయకూడదు.

710
టమాటా, కలబంద ఫేస్ ప్యాక్

ఒక పండిన టమాటాను మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసి, దానికి ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ లేదా ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఆకును కోసి లోపలి జెల్‌ను కలపండి.

ఈ మిశ్రమాన్ని15 నిమిషాలు ముఖానికి పట్టించి కడిగేయండి. చర్మం ప్రకాశవంతంగా కనబడుతుంది.

810
టమాటా, బేసన్ ఫేస్ ప్యాక్

టమాటా గుజ్జు, బేసన్‌లో తేనె కలిపి ముఖానికి పట్టించండి. 10 నిమిషాల తర్వాత కడిగేయండి. చనిపోయిన కణాలు తొలగిపోయి చర్మం సహజ కాంతిని పొందుతుంది.

910
ప్యాచ్ టెస్ట్ ముఖ్యం

కలబంద, టమాటా లేదా నిమ్మ తొక్కను నేరుగా ముఖానికి పట్టించే ముందు, ప్యాచ్ టెస్ట్ చేయండి లేదా చేతికి కొద్దిగా పట్టించి దురద లేదా అసౌకర్యం కలుగుతుందో లేదో చూసుకోండి, అప్పుడే ముఖానికి పట్టించండి.

1010
సన్‌స్క్రీన్, నైట్ క్రీమ్

పగటిపూట ఈ ప్యాక్‌లను ఉపయోగిస్తే, ప్యాక్ కడిగిన తర్వాత సన్‌స్క్రీన్ ఉపయోగించండి. రాత్రిపూట ఉపయోగిస్తే, చర్మం హైడ్రేటెడ్‌గా ఉండటానికి నైట్ క్రీమ్ ఉపయోగించండి.

click me!

Recommended Stories