గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే డాక్టర్లు రోజూ ఒక గుడ్డు తినమని చెబుతుంటారు. కానీ ఈ మధ్య మార్కెట్ లోకి నకిలీ గుడ్లు రావడం అందరినీ కలవరపెడుతోంది. ఈ గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. మరి మనం తినే గుడ్డు మంచిదా? నకిలిదో ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్ లోకి నకిలీ గుడ్ల రాక అందరినీ భయపెడుతోంది. ఇటీవల నకిలీ పన్నీర్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆహారశాఖ దాడులు చేసి టన్నుల కొద్దీ నకిలీ పన్నీర్‌ను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు మార్కెట్లో 'నకిలీ గుడ్లు' కలకలం రేపుతున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.
27
ఆరోగ్యానికి హాని
మార్కెట్లో నకిలీ గుడ్లు అమ్ముతున్నా చాలామంది గుర్తించలేకపోతున్నారు. తెలియకుండానే ఆ గుడ్లను కొని, వండుకుని తింటున్నారు. దాంతో తెలియకుండానే ఆరోగ్యానికి హాని జరుగుతోంది.
37
నకిలీ గుడ్డుతో డేంజర్
నకిలీ గుడ్లు తినడం వల్ల కిడ్నీలు, లివర్ దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నకిలీ గుడ్లలో కాల్షియం అల్జినేట్, జిలాటిన్, ప్లాస్టిక్ వంటి హానికరమైన పదార్థాలు ఉండటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం కూడా ఉందట.
47
నకిలీ గుడ్డు అంటే?
'నకిలీ గుడ్డు' కృత్రిమంగా తయారు చేయబడుతుంది. అసలైన గుడ్డులాగే కనిపిస్తుంది. ఇది అచ్చం గుడ్డులా కనిపించినా, అసలు గుడ్డు కాదు. దీనిలో పోషకాలు ఉండవు. దీన్ని తరచుగా తింటే తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
57
సింథటిక్ కెమికల్స్
అసలైన గుడ్లు శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహార వనరు. కానీ నకిలీ గుడ్లు సింథటిక్ రసాయనాలతో తయారవుతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. హానికరమైన రసాయనాల ప్రభావం వల్ల గ్యాస్, కడుపు నొప్పి, వికారం, వాంతులు, అతిసారం వంటి అనేక కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
67
నకిలీ గుడ్ల తయారీ
జిలాటిన్, సోడియం అల్జినేట్, పసుపు రంగు ఫుడ్ కలర్‌తో నకిలీ గుడ్డు పచ్చసొన తయారు చేస్తారని తెలిసింది. పారాఫిన్ వ్యాక్స్, జిప్సం పౌడర్, కాల్షియం సల్ఫైట్‌తో నకిలీ గుడ్డు తెల్లసొన తయారు చేస్తారట.
77
నకిలీ గుడ్లను గుర్తించే మార్గాలు
-'నకిలీ గుడ్డు' షెల్ చాలా గట్టిగా ఉంటుంది. నకిలీ గుడ్డు షెల్‌లో రంధ్రాలు ఉండవు.
- ఒక గిన్నెలో నీళ్లు పోసి కొన్న గుడ్లను అందులో వేయండి. అసలైన గుడ్డు అయితే నీటిలో మునిగిపోతుంది. నకిలీ గుడ్డు అయితే నీటిపై తేలుతుంది.
- గుడ్డును చెవి దగ్గర పట్టుకుని షేక్ చేయండి. అసలు గుడ్డు చాలా రోజులది అయితే తక్కువ శబ్దం వస్తుంది. నకిలీ గుడ్డు అయితే చెవి దగ్గర షేక్ చేస్తే ఎక్కువ శబ్దం వస్తుంది.
- నకిలీ గుడ్డు ఉడికించిన తర్వాత పచ్చసొన రబ్బరులా ఉంటుంది. దాని షెల్‌ను కాల్చినప్పుడు ప్లాస్టిక్ వాసన వస్తుంది.