బియ్యం కడిగిన నీటితో చర్మానికి, జుట్టుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

First Published Dec 1, 2021, 5:17 PM IST

బియ్యం కడిగిన నీరే కదా అని చాలామంది పారబోసేస్తుంటారు. వీటితో ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా అని అనుకుంటారు.  కానీ మీ అంచనా తప్పు అని ఆరోగ్య నిపుణులు (Health professionals) చేపట్టిన ఒక పరిశోధనలో తేలింది. బియ్యం కడిగిన నీటిలో అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని వాటి ద్వారా చర్మ సౌందర్యాన్ని, జుట్టు సంరక్షణ బాగుంటుందని తేలింది.  ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా బియ్యం కడిగిన నీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
 

బియ్యం కడిగిన నీటిలో (Rice washed water) కార్బొహైడ్రేడ్లు, ధాతువులు పుష్కలంగా ఉండటంతో ఈ నీటిని ఉపయోగించడంతో చర్మ సౌందర్యం, జుట్టు సంరక్షణ మెరుగుపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చర్మ సౌందర్యాన్ని, జుట్టు సంరక్షణను కాపాడుకోవడానికి మనం అనేక ప్రయత్నాలు (Attempts) చేస్తుంటాం.
 

కానీ తగిన ఫలితం లభించక నిరాశ చెందుతారు. బియ్యం కడిగిన నీటిలో అనేక పోషక విలువలు (Nutritional values) ఉంటాయి. అయితే ఇంట్లోనే నిత్యం లభించే బియ్యం కడిగిన నీటిని ఉపయోగించడంతో మంచి ఫలితం (Result) ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం బియ్యం కడిగిన నీటిని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం.
 

చర్మ సౌందర్యం కోసం బియ్యం కడిగిన నీటిలో కాటన్ బాల్స్ (Cotton Balls) లను ముంచి ఈ కాటన్ బాల్స్ తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే పోషక విలువలు ముఖంపై ఏర్పడే మొటిమలను (Pimples) వాటి తాలూకు మచ్చలను  తగ్గిస్తుంది. చర్మానికి తగినంత తేమను అందించి చర్మం పొడిబారకుండా చూస్తుంది.
 

చర్మ ఇన్ఫెక్షన్ (Skin infection) లను తగ్గిస్తుంది. చర్మానికి మేలు చేకూరుస్తుంది. వేసవికాలంలో ఏర్పడే చెమట పొక్కులను, దురదలను తగ్గించడానికి సహాయపడుతుంది. చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చర్మానికి సహజ నిగారింపును అందిస్తుంది. ఈ నీటిని ఉపయోగించడంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) ఉండవు. 
 

జుట్టు సంరక్షణ కోసం ముందుగా ఒక కప్పు బియ్యానికి (Rice) రెండు కప్పుల నీళ్ళు (Water) పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని వడగట్టి నీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇలా బియ్యం కడిగిన నీటిలో సగం కట్ చేసుకొన్న ఉల్లిపాయ రసాన్ని (Onion juice) వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకోవాలి.
 

అరగంట తరువాత గాఢత తక్కువ గల షాంపూతో తలంటూ స్నానం చేయాలి.  ఇలా తరచూ చేయడంతో జుట్టు రాలిపోవడం (Hair loss), పొడిబారడం (Drying), చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి. తలలో ఉండే ఇన్ఫెక్షన్ లను తగ్గించి జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది.
 

చుండ్రు (Dandruff) వంటి సమస్యలను నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా, పట్టులా మెరుస్తుంది. ఇది జుట్టుకు మంచి కండిషనర్ (Conditioner) గా కూడా పనిచేస్తుంది. జుట్టు రాలిపోవడాన్ని తగ్గించి జుట్టు పలుచ బడకుండా చేస్తోంది. ఇలా క్రమం తప్పకుండా చేయడంతో జుట్టుకు తొందరగా మంచి ఫలితం లభిస్తుంది.

click me!