చింతపండు ఫేస్ వాష్ తో ఇన్ని ప్రయోజనాలా.. ఇలా ఉపయోగిస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతం!

First Published Jan 2, 2022, 3:16 PM IST

నలుగురిలో అందంగా కనపడాలనేది అందరి ఆకాంక్ష. దీని కోసం చాలా మంది బయట మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్లు, క్లీనర్లు, టోనర్లు, ఫేస్ స్క్రబ్లు, ఫేస్ మాస్క్లు, ఫేస్ వాష్లను ఉపయోగిస్తున్నారు. కానీ ఈ ప్రొడక్ట్స్ లో ఉండే గాఢత ఎక్కువ గల రసాయనాలు చర్మ సౌందర్యాన్ని (Skin beauty) దెబ్బతీస్తాయి.
 

ఫలితంగా చర్మం పై ముడతలు, వలయాలు, మొటిమలు, మచ్చలు ఎక్కువవుతాయి. కనుక బయట దొరికే ప్రొడక్ట్స్ ల వాడకం తగ్గించి ఇంటిలోనే తయారుచేసుకుని సహజసిద్ధమైన పద్ధతులను వాడడం మంచిది అని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అందమైన చర్మ సౌందర్యం కోసం చింతపండు ఫేస్ వాష్ (Tamarind Face Wash) లను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా చింతపండు ఫేస్ వాష్ చర్మ సౌందర్యం కోసం ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..   
 

చింతపండు పోషకాలు గని (Nutrients mine). ఇందులో ఉండే పోషకాలు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. కలుషిత వాతావరణం కారణంగా చర్మ కణాలలో (Skin cells) పేరుకుపోయిన మురికిని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. చర్మంపై ఏర్పడిన మొటిమలు, మచ్చలు, వలయాలను తగ్గించి చర్మానికి మంచి నిగారింపును అందిస్తాయి.
 

స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను (Skin pigmentation problem) తగ్గిస్తుంది. చింతపండుతో తయారు చేసుకునే ఫేస్ వాష్ యాంటీ ఏజింగ్ లక్షణాలను (Anti-aging properties) కలిగి ఉంటుంది. ఇది మీ చర్మానికి పోషణ అందించి, మాయిశ్చరైజ్ చేసి, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
 

యుక్తవయసులో వృద్దాప్య చాయలు (Aging shades) రాకుండా అడ్డుకుంటుంది. ఇది చర్మానికి మంచి బ్యూటీ ప్రొడక్ట్ గా (Good beauty product) సహాయపడి మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఇప్పుడు మనం చింత పండుతో ఫేస్ వాష్ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
 

చింతపండు ఫేస్ వాష్ తయారీ విధానం: ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ ల చింతపండు గుజ్జు (Tamarind pulp), ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ (Rose water), ఒక టేబుల్ స్పూన్ పెరుగు (Curd), సగం టేబుల్ స్పూన్ విటమిన్ ఇ పౌడర్ (Vitamin E powder), ఒక టేబుల్ స్పూన్ జోజోబా ఆయిల్ (Jojoba Oil), ఒక టేబుల్ స్పూన్ తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి.
 

ఇలా కలుపుకోగా తయారైన మిశ్రమాన్ని కంటైనర్ (Container) లో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని చేతి వేళ్లతో ముఖానికి సున్నితంగా మర్దన (Massage) చేసుకోవాలి. ఇలా మర్దన చేసుకున్న రెండు నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి.   
 

ఇలా తరచూ చేస్తే చర్మ సమస్యలు (Skin problems) తగ్గి చర్మానికి మంచి నిగారింపును అందుతుంది. ఈ ఫేస్ వాష్ చర్మానికి మంచి మాయిశ్చరైజర్ (Moisturizer) గా సహాయపడుతుంది. ఈ ఫేస్ వాష్ చర్మసౌందర్యం కోసం మంచి ఫలితాన్ని అందిస్తుంది.

click me!