బియ్యప్పిండితో కుర్‌కురేల రెసిపీ.. ఇంట్లోనే ఇలా చెయ్యండి!

Navya G   | Asianet News
Published : Jan 02, 2022, 12:47 PM IST

 పిల్లలకు ఎప్పుడూ రొటీన్ (Routine) గా చేసే స్నాక్స్ ఐటమ్స్ ఇస్తే వాటిని తినడానికి ఇష్టపడరు. వారు వెరైటీ ఐటమ్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటప్పుడు హెల్తీగా బియ్యప్పిండితో చేసుకునే కుర్ కురేలను (KurKure) ఇస్తే వారు తినడానికి ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా బియ్యప్పిండితో కుర్ కురే ల తయారీ విధానం గురించి తెలుసుకుందాం..  

PREV
16
బియ్యప్పిండితో కుర్‌కురేల రెసిపీ.. ఇంట్లోనే ఇలా చెయ్యండి!

కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యప్పిండి (Rice flour), పావు కప్పు శెనగపిండి (Besan), రెండు టేబుల్ స్పూన్ ల గోధుమ పిండి (Wheat flour), రెండు కప్పులు నీళ్లు (Water), పావు స్పూన్ వంట సోడా (Baking soda), రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక స్పూన్ వెన్న (Butter),
 

26

రెండు టేబుల్ స్పూన్ ల కార్న్ ఫ్లోర్ (Corn flour), కావలసినంత కారం (Red chilly powder), సగం స్పూన్ గరం మసాలా (Garam masala), సగం స్పూన్ చాట్ మసాలా (Chat masala), ఒక స్పూన్ చక్కెర పొడి (Sugar powder), నూనె (Oil) ఢీ ఫ్రైకి సరిపడినంత.
 

36

తయారీ విధానం: ఒక గిన్నెలో  బియ్యప్పిండి, గోధుమ పిండి, శెనగపిండి, ఉప్పు, కార్న్ ఫ్లోర్, వంటసోడా వేసి బాగా కలుపుకుని (Mix well) ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా దోసె పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి తక్కువ మంట (Low flame) మీద వేడి చేసుకోవాలి.
 

46

మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.  పిండి చిక్క పడుతున్నప్పుడు ఇందులో కొంచెం వెన్న  (Butter) వేసి మరోసారి బాగా కలుపుకొని చపాతీ పిండిలా అయ్యేవరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి చల్లారిన తర్వాత (After cooling) చిన్న ఉండలుగా చేసుకుని పొడవుగా కుర్ కురేలా ఒత్తుకోవాలి.
 

56

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో వేయించడానికి సరిపడా నూనె (Oil) వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో తయారుచేసుకున్న కుర్ కురే లను వేసి క్రిస్పీగా (Crispy) బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి.ఇలా మొత్తం పిండిని తయారు చేసుకోవాలి.
 

66

ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే పిల్లలకు ఇష్టమైన కరకరలాడే రుచికరమైన బియ్యప్పిండి కుర్ కురేలు (Rice flour KurKure) రెడీ (Ready). ఇలా ఇంట్లోనే హెల్తీగా (Healthy) బియ్యప్పిండితో చేసుకునే కుర్ కురేలు చాలా రుచిగా (Delicious) ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కుర్ కురేలను ఒకసారి ట్రై చేయండి. కుర్ కురేలను బయట మార్కెట్ నుంచి తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి.

click me!

Recommended Stories