పశ్చిమోత్తనాసనం
ఈ ఆసనం స్నాయువును బలపరుస్తుంది, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే, కాళ్లు, పొట్ట ,తుంటిలో కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ ఆసనం చేయడానికి మీ పాదాలను ముందుకు ఉంచండి.
ఇప్పుడు, లోపల శ్వాస తీసుకోండి, రెండు చేతులను పైకి ఎత్తండి. తర్వాత ఊపిరి పీల్చుకుంటూ ముందుకు వంగండి. ఈ సమయంలో వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి. ఇలా పలుమార్లు చేయాలి.