లూజ్ మోషన్స్ ను తగ్గించుకోవడానికి మందుల కంటే ఇవే బెటర్.. తొందరగా తగ్గుతాయి..

Published : Apr 22, 2023, 10:22 AM IST

రెండు మూడు రోజుల నుంచి విరేచనాల సమస్య ఉంటే మీ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అతిసారం వల్ల ఒంట్లో శక్తి ఉండదు. నిర్జలీకరణం బారిన కూడా పడతారు.   

PREV
18
లూజ్ మోషన్స్ ను తగ్గించుకోవడానికి మందుల కంటే ఇవే బెటర్.. తొందరగా తగ్గుతాయి..

మిగిలిపోయిన ఫుడ్, వడగాలులు, అధిక ఉష్ణోగ్రత, మురికి నీరు లేదా అసమతుల్య శారీరక శ్రమ వంటి ఎన్నో కారణాల వల్ల ఎండాకాలంలో విరేచనాలు అవుతాయి. ఈ సమస్య చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. విరేచనాల వల్ల మీ శరీరం నుంచి నీళ్లు ఎక్కువగా విడుదల అవుతాయి. నీటి లీకేజీ కారణంగా మీరు నిర్జలీకరణం బారిన కూడా పడొచ్చు. డీహైడ్రేషన్ ప్రాణాలను కూడా తీస్తుంది. అందుకే దీనికి వీలైనంత తొందరగా చికిత్స చేయాలి. అయితే కొన్ని ఇంటి నివారణలతో కూడా విరేచనాలను ఆపొచ్చు. అదెలాగంటే.. 
 

28

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. అతిసారం కొన్ని లక్షణాలు

పెద్దవారికికి 2 రోజులకు పైగా విరేచనాలు ఉన్నట్టైతే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. 
102 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ జ్వరం
మీ కడుపు లేదా పురీషనాళంలో తీవ్రమైన నొప్పి.
మలంలో రక్తం లేదా చీము 
కొన్నిసార్లు మలం నలుపు, తారు మాదిరిగా ఉంటుంది. 

38
water

నీళ్లను ఎక్కువగా తాగాలి

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. మీకు విరేచనాలు ఉంటే నీళ్లను ఎక్కువగా తాగండి. డయేరియాతో బాధపడే పెద్దలు నీరు, పండ్ల రసాలు, స్పోర్ట్స్ డ్రింక్స్, కెఫిన్ లేని సోడాలను తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. యు.ఎస్. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ప్రకారం.. రోజుకు పురుషులు 15.5 కప్పులు (3.7 లీటర్లు), మహిళలు 11.5 కప్పుల (2.7 లీటర్లు) నీటిని తాగాలి. 
 

48
banana

అరటిపండ్లు 

అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే డయేరియా నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది డయేరియాను పూర్తిగగా తగ్గిస్తుంది. అయితే మీరు పాల ఉత్పత్తులను తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి విరేచనాలను ఎక్కువ చేస్తాయి. అలాగే వాయువు, ఉబ్బరం సమస్యను కలిగిస్తాయి. పాల ఉత్పత్తులలో మీరు పెరుగును తినొచ్చు. ఎందుకంటే దీనిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి విరేచనాలకు కారణమయ్యే బ్యాక్టీరియాను, దాని తీవ్రతను తొలగిస్తాయి. 
 

58

విశ్రాంతి తీసుకోండి

విరేచనాలతో బాధపడుతూ వ్యాయామం చేసినా.. పనిచేసినా మీ శరీరం నిర్జలీకరణం బారిన పడుతుంది.  విరేచనాలు ఉన్నప్పుడు మీ శరీరానికి ఎక్కువ విశ్రాంతి అవసరం. అందుకే ఈ సమయంలో భారీ వ్యాయామాలు చేయొద్దు. అయితే మీ రోజువారీ పని చేయండి. అలాగే ఎక్కువ కేలరీలు బర్న్ చేయకుండా ఉండండి. విరేచనాలలో మీరు తేలికపాటి వ్యాయామం చేయాలి. కానీ ఎక్కువ ఉదర వ్యాయామం చేయకూడదు.

68
Image: Getty Images

అల్లం 

ఎన్నో ఏండ్లు అల్లాన్ని ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి సాంప్రదాయ చికిత్సలకు ఉపయోగిస్తున్నారు. విరేచనాలలో అల్లాన్ని వాడితే దాని లక్షణాలు తగ్గుతాయి. శస్త్రచికిత్స లేదా కెమోథెరపీ తర్వాత కదలిక అనారోగ్యం, గర్భధారణ సంబంధిత అసౌకర్యాన్ని తగ్గించడానికి ఇది చాలా సంవత్సరాలుగా ఉపయోగించబడింది.
 

78

కొన్ని ఆహారాలకు దూరంగా ఉండండి

విరేచనాలు ఉన్నప్పుడు మీరు కొన్ని రకాల ఆహారాలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే అవి మీ విరేచనాలను మరింత దిగజార్చుతాయి. అధిక కొవ్వు ఆహారాలు, ఆయిలీ, కారంగా ఉండే ఆహారాలు, కృత్రిమ స్వీటెనర్లతో కూడిన ఆహారాలు లేదా ఎక్కువ మొత్తంలో ఫ్రక్టోజ్ ఉన్న ఆహారాలను అసలే తినకూడదు. వీటిని తింటే సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. 
 

88

నిమ్మకాయ, చక్కెర, ఉప్పు

విరేచనాల వల్ల మన శరీరంలోని నీరు బయటకు పోతుంది. దీనివల్ల మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీకు గ్లూకోజ్ అవసరం. బయటి గ్లూకోజ్ పౌడర్ మీద ఆధారపడకుండా పంచదార, ఉప్పు, నిమ్మరసం కలిపి కాచి చల్లార్చిన నీటిని తాగితే మంచిది. ఇది మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. నిమ్మకాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది మీ కడుపును శాంతపరచడానికి సహాయపడుతుంది.

click me!

Recommended Stories