ఆయుర్వేదంలో తులసి ఆకులను ఎన్నో ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. ఎందుకంటే తులసిలో దివ్య ఔషద గుణాలు దాగున్నాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే తులసి నీటిని ఖచ్చితంగా తాగాలని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. తులసిని ఎన్నో ఏండ్ల నుంచి జ్వరం, జలుబును తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. ఉదయాన్నే పరగడుపున తులసి ఆకులతో కాచిన నీటిని తాగడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వాటర్ మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
25
tulsi water
ఉదయాన్నే పరగడుపున తులసి నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు ఎక్కువ శక్తిని అందించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే శరీరంలో ఉన్న విషాన్ని బయటకు పంపుతుంది. అలాగే కడుపును శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది. తులసి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి జీర్ణ అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి.
35
thulsi water
శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేయడానికి తులసి టీ అద్బుతంగా సహాయపడుతుంది. తులసి టీని రోజూ తాగడం వల్ల కొవ్వులు కరుగుతాయి. తులసి నీటిని రోజూ తాగడం వల్ల ప్రేగు కదలిక మెరుగుపడుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ తగ్గుతుంది. అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇది శరీరంలోంచి ప్రమాదకరమైన విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది.
45
తులసి నీరు జలుబు, జ్వరం నుంచి ఉబ్బసం వరకు కొన్ని శ్వాసకోశ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. ఇది ఇమ్యునోమోడ్యులేటరీ, యాంటిట్యూసివ్, ఆశాజనక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వివిధ శ్వాసకోశ సమస్యల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.
55
శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ను సమతుల్యం చేయడానికి తులసి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కార్డిసాల్ హార్మోన్ ఒత్తిడిని కలిగిస్తుది. అయితే తులసి నిరాశ, ఆందోళనల వివిధ లక్షణాలను తగ్గిస్తుంది. ఇది మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మంచి జీర్ణవ్యవస్థ త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పేలవమైన జీర్ణవ్యవస్థ బరువు పెరగడానికి దారితీస్తుంది.