యోగా మీ ఆరోగ్యంపై పనిచేస్తుందో లేదో ఇలా తెలుసుకోండి

Published : May 13, 2023, 03:37 PM IST

యోగా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. అందుకోసమే రోజూ యోగా చేయాలంటారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ యోగా మన ఆరోగ్యానికి పనిచేస్తుందో లేదో ఎలా తెలుసుకోవాలంటే..  

PREV
16
 యోగా మీ ఆరోగ్యంపై పనిచేస్తుందో లేదో ఇలా తెలుసుకోండి

యోగా, ధ్యానం కేవలం రోజువారీ అభ్యాసాలు మాత్రమే కాదు.. ఇవి స్వీయ ఎదుగుదలకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి మన జీవితంలో శాంతిని నింపడానికి, సానుకూలతను పొందడానికి సహాయపడతాయి. అందుకే క్రమం తప్పకుండా యోగాను చేయాలంటారు ఆరోగ్య నిపుణులు. రోజూ వ్యాయామం చేయడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరి యోగా మీ ఆరోగ్యంపై పనిచేస్తుందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. 
 

26

స్థిరమైన శక్తి

ఒక్కోసారి రోజంతా నీరసంగా, అలసటగా, ఎనర్జీ లేనట్టుగా అయిపోతాం. అయితే క్రమం తప్పకుండా యోగాను చేస్తే మన ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. యోగా మీ  శరీరంపై పనిచేస్తుందనడానికి ఇదే సంకేతం. దీనివల్ల మీ శరీరంలో స్థిరమైన సానుకూల శక్తిని మీరు అనుభూతి చెందుతారు. రోజంతా చేసే పనుల్లో ఫ్రెష్ గా, ఉత్సాహంగా ఉంటారు.
 

36

ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలు

కొన్ని నిర్దిష్ట యోగా భంగిమలు మీ జీర్ణ అవయవాలకు మంచి మసాజ్ గా పనిచేస్తాయి. రక్త ప్రవాహం, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తాయి. ఇవి పెరిస్టాల్సిస్ ప్రక్రియకు సహాయపడతాయి. మలం కదలికను ప్రోత్సహిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రేగు కదలిక సాధారణ యోగా అభ్యాసం ఫలితమే.
 

46

తాజాగా మేల్కొంటారు

చాలాసార్లు మనం రాత్రిపూట 7 నుంచి 8 గంటలు నిద్రపోతాం. అయినా ఉదయం లేచిన తర్వాత అలసటగా, శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. ఇది మీ ఆరోగ్యం బాలేదనడానికి సంకేతం. తక్కువ శక్తి మిమ్మల్ని నీరసంగా చేస్తుంది. పనుల పట్ల ఇంట్రెస్ట్ ను తగ్గిస్తుంది. మీ మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు. కానీ యోగా సాధన చేసిన తర్వాత మీరు ఫ్రెష్ గా అనిపిస్తే యోగా మీపై పనిచేస్తుందన్నట్టే. రోజూ యోగా చేసేవారు ఉదయం ఫ్రెష్ గా మేల్కొంటారు.

56

 క్రమం తప్పకుండా పీరియడ్స్

యోగా ద్వారా శరీర కదలికలు సాధారణ హార్మోన్ల పనితీరు, రుతుచక్రానికి సహాయపడతాయి. యోగా పీరియడ్స్ తిమ్మిరిని కూడా తగ్గిస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎన్నో మార్గాల్లో మెరుగుపరుస్తుంది. స్థిరమైన యోగా ఒత్తిడి, ఆందోళన, నిరాశ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో అడ్రినల్, కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఒత్తిడి తగ్గడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. దీంతో పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తాయి.
 

66

మంచి మానసిక స్థితి

యోగా మీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఇది మీ మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శరీరానికి సామరస్యాన్ని తెస్తుంది. యోగా మీ శరీరంలో ఒత్తిడి స్థాయిలను మరింత తగ్గిస్తుంది. మీ శరీరాన్ని మెరుగుపరుస్తుంది. యోగా తర్వాత మీరు చాలా తేలికగా, సంతోషంగా, ప్రశాంతంగా అనుభూతి చెందుతారు. 

click me!

Recommended Stories