ఫలితంగా కంటి చూపు మసకబారడం, కళ్లు పొడిబారడం, కంట్లో మంట, కంటి వెంట నీరు కారడం తదితర సమస్యలతో బాధపడాల్సి వస్తోంది. సాధారణంగా వయసు పెరుగుతున్న క్రమంలో కంటి చూపు మసకబారడం సహజం. కానీ, చిన్న వయసులోనే ఈ సమస్య కనిపిస్తే అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయవద్దు. ఉదయం నిద్రలేస్తూనే స్మార్ట్ ఫోన్ పట్టుకుంటున్నారు. రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ తోనే గడుపుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో కంటి చూపు మసక బారకుండా ఉండాలంటే కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.