బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఆహారం తీసుకోకూడదు మీకు తెలుసా?

First Published Jan 7, 2021, 12:47 PM IST

ఏది ఏమైనా మనం ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ని అస్సలు స్కిప్ చేయకూడదని నిపుణులు చెబుతూ ఉంటారు.అలా అని ఏది పడితే అది.. అల్పాహారంగా తీసుకోకూడదని కూడా నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
 

ఆరోగ్యంగా కలకలం ఉండాలని అందరూ ఆశపడతారు. చివరి వరకు ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. అయితే.. మనం ఆరోగ్యకరమైనవి అనుకుంటూ.. తీసుకునే కొన్ని ఫుడ్స్.. మనకు చేటు తెస్తున్నాయి.
undefined
ఏది ఏమైనా మనం ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ని అస్సలు స్కిప్ చేయకూడదని నిపుణులు చెబుతూ ఉంటారు.అలా అని ఏది పడితే అది.. అల్పాహారంగా తీసుకోకూడదని కూడా నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
undefined
1. పచ్చి కూరగాయలు..చాలా మంది పచ్చి కూరగాయలు తినడం మంచిది కదా అని.. అల్పాహారంగా వాటిని తీసుకుంటూ ఉంటారు. అవి మంచిదే కానీ.. బ్రేక్ ఫాస్ట్ సమయంలో మాత్రం తీసుకోకూడదట. ఎందుకంటే వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో.. కడుపులో గ్యాస్ తయారవ్వడం, కడుపులో నొప్పి రావడం లాంటివి జరుగుతాయి.
undefined
2.సి విటమిన్ పండ్లు..సి విటమిన్ పండ్లు.. తినడం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ..ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. అంటే.. అల్పాహారంగా తీసుకోకూడదు. తీసుకుంటే.. యాసిడ్ తయారై.. గుండెలో మంట వస్తుంది.
undefined
3.కాఫీ..ఉదయాన్నే కాఫీ తాగడం కూడా అంత మంచిది కాదు. దాని వల్ల కడుపులో యాసిడ్ తయారౌతుంది. దీని వల్ల కూడా అరుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
undefined
4.పంచదార, చల్లని కూల్ డ్రింక్స్..ఉదయాన్ని పంచదార ఎక్కువగా ఉండే ఆహారాలు, కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు.
undefined
5. అరటి పండు..ఉదయాన్నే అరటి పండు తినకూడదు. అరటిలో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనిని కనుక ఉదయాన్నే తీసుకుంటే.. న్యూట్రిషన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి.
undefined
6.పెరుగు..అల్పాహారం సమయంలో పెరుగు తీసుకోకూడదు. అందులో ఉండే లాక్టిక్, బ్యాక్టీరియా.. ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల యాసిడ్ సమస్యకు కారణమౌతుంది.
undefined
7.పల్లీ చెక్క..పల్లీలు, బెల్లంతో తయారు చేసిన పల్లీ చెక్క ఆరోగ్యానికి చాలా మంచిది కానీ.. ఉదయాన్నే మాత్రం తినడం మంచిది కాదు.
undefined
8.పప్పు ధాన్యాలు..పప్పుధాన్యాలు ఆరోగ్యానికి మంచిది కానీ.. పరగడుపున తీసుకోకూడదు.
undefined
9.ప్యాన్ కేకు, వఫెల్స్..బ్రేక్ ఫాస్ట్ లో ప్యాన్ కేకు, బటర్ ఉండే వాటిని కూడా తీసుకోకూడదు. దీని వల్ల షుగర్ లెవల్స్ పెరిగిపోతాయట.
undefined
click me!