నగ్న పాదాలతో నడక.. ఆరోగ్యాన్ని మీ సొంతం చేస్తుందట..

First Published Jan 3, 2021, 10:40 AM IST

మార్నింగ్ వాక్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది షూస్. మంచి షూస్ ఉంటే వాకింగ్ చక్కగా జరుగుతుందని ఫీలవుతారు. నూటికి తొంభైశాతం మంది షూస్ తోనే మార్నింగ్ వాక్ చేస్తారు. ఇంకొంతమంది చెప్పులతోనే కానిచ్చేస్తుంటారు.

మార్నింగ్ వాక్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది షూస్. మంచి షూస్ ఉంటే వాకింగ్ చక్కగా జరుగుతుందని ఫీలవుతారు. నూటికి తొంభైశాతం మంది షూస్ తోనే మార్నింగ్ వాక్ చేస్తారు. ఇంకొంతమంది చెప్పులతోనే కానిచ్చేస్తుంటారు.
undefined
అయితే చెప్పులు, షూలు లేకుండా ఉత్త పాదాలతో వాకింగ్ చేయమని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అదే మీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని, దానివల్ల చాల మేలు జరుగుతుందని చెబుతున్నారు.
undefined
రోజూ మార్నింగ్ వాక్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. దీనివల్ల శరీరం ఫిట్‌గా ఉండి అనారోగ్యాలు దరిచేరవు. వాకింగ్ అనగానే అంతా చెప్పులు లేదా షూలు వేసుకుని నడుస్తారు.
undefined
అయితే, అప్పుడప్పుడు చెప్పులు లేకుండా ఉత్త పాదాలతో నడవడం కూడా ఆరోగ్యానికి మంచిదేనట.
undefined
ఉదయాన్నే ఉత్త కాళ్లతో వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది. అయితే.. ఉత్త పాదాలతో నడిచేప్పుడు.. రాళ్లు తేలిన రోడ్లపై కాకుండా.. పచ్చని పచ్చికపై, మెత్తని ఇసుకపై, మట్టిపై నడవమని చెబుతున్నారు.
undefined
చెప్పులు వేసుకోకుండా ఉత్త పాదాలతో నడిస్తే.. మెదడుకు మంచిదని ఓ అధ్యయనంలో పేర్కొన్నారు.
undefined
భూమిలో ఉండే ఎలక్ట్రాన్స్ మన శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లను ప్రభావితం చేస్తాయి. నిద్రలేమి, ఒత్తిడితో బాధపడేవారికి ఈ నడక ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
undefined
అయితే, ఇంట్లో నేలపై లేదా సిమెంటు రోడ్లపై నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రకృతి ప్రసాదించిన మట్టిలో, గడ్డిపై మాత్రమే నడవండి. మీ కాళ్లకు చాలా హాయిగా కూడా అనిపిస్తుంది.
undefined
నగరాల్లో మట్టి, గడ్డి నేలని వెతుక్కోవడం కొంచెం కష్టమే. కాబట్టి.. మీ దగ్గర్లో ఏదైనా పార్క్‌కు వెళ్లండి. రోజూ కుదరకపోయినా.. రోజుకు ఒక్కసారైనా సరే పార్కులో ఉత్త పాదాలతో వాకింగ్ చేయండి.
undefined
దీనివల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. మోకాళ్ల నొప్పులు సైతం మాయమవుతాయి. కండరాల బలహీనత, మధుమేహం సమస్యతో బాధపడేవారికి కూడా ఈ నడక మంచిదే. కాబట్టి.. ఈ రోజు నుంచే చెప్పులకు బై బై చెప్పేసి.. ఉత్త పాదాలతో నడిచేయండి.
undefined
click me!