ఈ విషయాన్ని బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, ఫిన్లాండ్, తదితర దేశాల్లోని పరిశోధకులు వివిధ రకాల మనుషుల్ని పరీక్షించి కనిపెట్టారు. 51 నుంచి 75 సంవత్సరాల లోపు ఉన్న వారిపై ఈ స్టాండింగ్ టెస్ట్ చేశారు. వారిలో 20 శాతం మంది కనీసం 10 సెకన్లు కూడా నిలబడలేకపోయారట. వారిలో చాలా మంది కేవలం పదేళ్లలోపే అనేక ఆరోగ్య సమస్యలతో మరణించారట.