ఎంతో రుచికరమైన నోరూరించే వేడివేడి మ్యాగీ కట్లెట్స్.. ఎలా చెయ్యాలంటే?

Published : Mar 16, 2022, 02:15 PM IST

ఎప్పుడు రొటీన్ గా చేసుకునే మ్యాగీకి బదులుగా ఈసారి కాస్త వెరైటీగా మ్యాగీ కట్లెట్స్ లను ట్రై చెయ్యండి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం మ్యాగీ కట్లెట్స్ (Maggie Cutlets) తయారీ విధానం (Method of preparation) గురించి తెలుసుకుందాం..  

PREV
18
ఎంతో రుచికరమైన నోరూరించే వేడివేడి మ్యాగీ కట్లెట్స్.. ఎలా చెయ్యాలంటే?
Maggie Cutlets

కావలసిన పదార్థాలు: రెండు చిన్న మ్యాగీ (Maggi) ప్యాకెట్స్, ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి (Chilies) తరుగు, ఒక టీ స్పూన్ వెల్లుల్లి (Garlic) తరుగు, ఒక ఉల్లిపాయ (Onion) తరుగు, రెండు టేబుల్ స్పూన్ ల క్యారెట్ (Carrot) తరుగు, సగం టీస్పూన్ కారం (Mirchi powder).
 

28
Maggie Cutlets

సగం టీస్పూన్ మిరియాల పొడి (Pepper powder), ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా (Maggi masala), రుచికి సరిపడా ఉప్పు (Salt), రెండు ఉడికించిన బంగాళదుంపలు (Potatoes), రెండు టేబుల్ స్పూన్ ల మైదా (Maida), ఢీఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil).
 

38
Maggie Cutlets

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఒక ప్యాకెట్ మ్యాగి పొడిని వేసి తక్కువ మంట (Low flame) మీద లైట్ బ్రౌన్ కలర్ (Light brown color) వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.
 

48
Maggie Cutlets

ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యారెట్, అల్లం తరుగులను వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులో కారం, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, మ్యాగీ మసాలా (Maggi masala) వేసి బాగా కలుపుకోవాలి (Mix well).
 

58
Maggie Cutlets

అలాగే ఇందులో ఉడికించి పెట్టుకున్న మెత్తటి బంగాళాదుంప (Boiled potatoes) మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాల తరువాత  స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో చిన్న ప్యాకెట్ మ్యాగీని (Maggi) తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా పొడి చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకోవాలి.
 

68
Maggie Cutlets

ఒక గిన్నెలో మైదా వేసి అందులో కొద్దిగా నీళ్ళు పోసి గరిటజారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మ్యాగీబంగాళదుంప   మిశ్రమాన్ని తీసుకొని కట్లెట్ ఆకారంలో (Cutlet shape) చేసుకుని మైదా మిశ్రమంలో (Maida mixture) ముంచి మరల మ్యాగీ పొడిలో ముంచి ప్లేట్ లో పెట్టుకోవాలి.
 

78
Maggie Cutlets

ఇలా మొత్తం మిశ్రమాన్ని కట్లెట్స్ లా చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి అందులో ఢీఫ్రైకి సరిపడా ఆయిల్ (Oil) పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తరువాత అందులో కట్లెట్స్ లను వేసి తక్కువ మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై (Fry) చేసుకోవాలి.
 

88
Maggie Cutlets

ఇలా ఫ్రై చేసుకున్నా మ్యాగీ కట్లెట్ లను ఒక ప్లేట్ లో తీసుకుని టమోటా సాస్ (Tomato sauce) తో సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన వేడివేడి మ్యాగీ కట్లెట్స్ రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ స్నాక్ ఐటంను ఒకసారి ట్రై చేయండి.

click me!

Recommended Stories